Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి (Champions Trophy Tour) సంబంధించి భారత్-పాక్ మధ్య వాతావరణం వేడెక్కింది. పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లో పర్యటించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దీని వెనుక కారణాన్ని పీసీబీ.. ఐసీసీని అడిగి ఆరా తీస్తోంది. భద్రతా కారణాలను బీసీసీఐ ఇప్పటికే పేర్కొంది. ఈ సిరీస్‌లో పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను నిర్వహించనుంది. ఈ పర్యటనలో ఛాంపియన్స్ ట్రోఫీ పోకెలోని మూడు నగరాలకు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఈ విషయంలో పీసీబీకి ఐసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. షెడ్యూల్ ప్రకారం.. ట్రోఫీని స్కర్డు, ముర్రే, హుంజా, ముజఫరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉంది. అయితే వీటిలో స్కర్డు, హుంజా, ముజఫరాబాద్‌లు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రోఫీని పీఓకేకి పంపేందుకు ఐసీసీ అంగీకరించడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఏ వివాదాస్పద ప్రదేశానికి వెళ్లబోదని ఐసీసీ పీసీబీకి తెలిపింది. నవంబర్ 14న ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్లామాబాద్ చేరుకోవడం గమనార్హం.
Also Read: Toll Tax Update: టోల్ ట్యాక్స్ విషయంలో మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
దీని తరువాత ట్రోఫీని నవంబర్ 16 నుండి నవంబర్ 24 వరకు పాకిస్తాన్ అంతటా తీసుకెళ్లాల్సి ఉంది. ఈ విషయాన్ని పీసీబీ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీని స్కర్డు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్ వంటి ప్రదేశాలకు వెళ్తుందని పీసీబీ తెలపడంతో ఐసీసీ వ్యతిరేకించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఐసీసీ సమావేశాన్ని రద్దు చేసింది
ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో నవంబర్ 11న జరగాల్సిన ఐసీసీ సమావేశాన్ని వాయిదా వేసింది. ఇందులో షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది.