Olympics Prize Money : ఒలింపిక్ గేమ్స్.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైనవి. వాటిలో మెడల్ సాధించడాన్ని ప్రతీ అథ్లెట్, ప్రతీ క్రీడాకారుడు లైఫ్ టైం గోల్‌గా పెట్టుకుంటాడు. ప్రపంచ దేశాలు కూడా ఈ గేమ్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. మెడల్స్ సాధించే వారిని ఆకర్షణీయమైన పారితోషికాలతో సత్కరిస్తుంటాయి. ఒలింపిక్ మెడల్ విన్నర్లకు ఏయే దేశాలు ఎంతమేర పారితోషికాలు(Olympics Prize Money) ఇచ్చుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
భారత సర్కారు ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలుచుకునే వారికి రూ. 75 లక్షల ప్రైజ్‌మనీని అందిస్తోంది. రజత పతకం సాధించే వారికి రూ. 50 లక్షలు, కాంస్య పతకం సాధించే వారికి రూ. 10 లక్షలను బహూకరిస్తోంది. ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించే వారికి భారత ఒలింపిక్ సంఘం రూ.కోటిని అందిస్తోంది.
రష్యా
రష్యా సర్కారు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ గెలుచుకునే వారికి రూ.37 లక్షల ప్రైజ్ మనీనీ అందిస్తోంది. దీంతో పాటు వారికి కార్లు, అపార్ట్‌మెంట్లను గిఫ్టులుగా అందిస్తారు. వివిధ బిరుదులను కూడా ప్రకటిస్తారు. రష్యా ప్రభుత్వం నుంచి జీవితకాలం పాటు స్టైపెండ్‌లను కూడా అందిస్తారు.
సౌదీ అరేబియా
సౌదీ అరేబియా సర్కారు ఒలింపిక్ మెడల్స్ గెలుచుకునే వారికి రూ.11 కోట్లకుపైనే అందిస్తోంది. అయితే ఆదేశం ఒలింపిక్స్‌లో మెడల్స్ గెలుచుకుంటున్న దాఖలాలు చాలా తక్కువ. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెల్చుకున్న సౌదీ అరేబియా కరాటే అథ్లెట్ తారెగ్ హమేదీకి సౌదీ ప్రభుత్వం రూ.11 కోట్లను ప్రదానం చేసింది.
కజకిస్తాన్
కజకిస్తాన్ సర్కారు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించే వారికి మంచి బహుమతులు అందిస్తోంది. వారికి విలాసవంతమైన త్రీ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్లను బహుమతిగా ఇస్తోంది. రజత పతకం సాధించే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, కాంస్య పతకం సాధించే వారికి సింగిల్ బెడ్‌రూమ్ ఇంటిని గిఫ్టుగా ప్రభుత్వం అందిస్తోంది.
Also Read :Anant-Radhika Marriage: అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు రూ. 5వేల కోట్లు కాదట.. రూ. 6,500కోట్లు ఖర్చు చేశారట..!
మలేషియా
మలేషియా సర్కారు ఒలింపిక్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించే వారికి విలాసవంతమైన కార్లను బహుమతిగా అందిస్తోంది. రజత, కాంస్య పతకాలు సాధించే వారికి కూడా పారితోషికాలను అందించి సత్కరిస్తారు.
సింగపూర్
సింగపూర్ సర్కారు ఒలింపిక్ పతకాలను సాధించే వారిని ఘనంగా సత్కరిస్తుంటుంది. ఇందుకోసం అక్కడ ప్రత్యేక ప్రోత్సాహక పథకం అమలవుతోంది. ప్రత్యేకించి గోల్డ్ మెడల్ విన్నర్స్‌కు ఆ దేశ ప్రభుత్వం రూ.6.50 కోట్ల దాకా పారితోషికం ఇస్తోంది. రజత పతక విజేతలకు రూ.2.69 కోట్ల పారితోషికం అందిస్తున్నారు. ఇక కాంస్య పతక విజేతలకు రూ.1.55 కోట్ల పారితోషికాన్ని అందిస్తున్నారు.
Also Read :Bigg Boss 8 : బిగ్ బాస్ కోసం కింగ్ సైజ్ రెమ్యునరేషన్..!
తైవాన్
ఒలింపిక్ పతక విజేతలను తైవాన్ సర్కారు కూడా సత్కరిస్తోంది. గోల్డ్ మెడల్ విన్నర్స్‌కు రూ.5 కోట్లను ఇస్తోంది. ఆ తర్వాత ప్రతినెలా వారికి రూ.3 లక్షల స్టైఫెండ్ ఇస్తారు.
ఆస్ట్రియా
ఆస్ట్రియా దేశంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేతకు(Olympics Winners) రూ.15 లక్షలను బహుమతిగా ప్రదానం చేస్తారు.