ముంబై నుంచి కొలంబోకు ఎకానమీ టిక్కెట్ ధర రూ.60,000 ఉండగా, ప్రీమియం ఎకానమీ ధర రూ.84,000గా ఉంది. శ్రీలంక ఎయిర్ లైన్స్‌లో ముంబై-కొలంబో విమానం టిక్కెట్ ధర రూ.63,340, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధర రూ.1,34,157గా ఉంది.
సాధారణంగా ఢిల్లీ-కొలంబో టిక్కెట్ ధర రూ.30,000 ఉండగా, ఇప్పుడు రూ.90,000కు చేరుకుంది. బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు రూ.1,92,000 నుంచి రూ.2,25,000 వరకు పలుకుతున్నాయి.
మొదట భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పలు దఫాలుగా చర్చలు జరిగిన అనంతరం టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించి ఉత్కంఠకు తెరదించింది. దీంతో శ్రీలంకకు విమాన టిక్కెట్ల ధరలు, కొలంబోలో హోటల్ వంటి వసతి ధరలు కూడా పెరుగుతున్నాయి.
ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ప్రీమియం త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒకరోజుకు డబుల్ బెడ్ రూమ్‌ల ధరలు రూ.1.05 లక్షల నుంచి రూ.1.06 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డిమాండ్ లేని సమయాల్లో ఈ ధర రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.
