Team India In World Cup: ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు (Team India In World Cup) ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8న చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు మూడోసారి ప్రపంచకప్ గెలుస్తుందా..? నిజానికి గత 10 ఏళ్లలో భారత జట్టు ఏ ఐసీసీ టోర్నీని గెలవలేకపోయింది. ఈ కరువుకు స్వస్తి పలకాలని టీమ్ ఇండియా కోరుకుంటోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది.
అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా
ప్రస్తుత భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో అత్యధిక పరుగులు చేశాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో 13083 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ సగటు 57.38గా ఉంది. ఇది కాకుండా విరాట్ కోహ్లీ 47 సెంచరీలు చేశాడు. అలాగే 66 సార్లు యాభై పరుగుల మార్కును దాటాడు. కాగా.. బౌలర్ల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు రవీంద్ర జడేజా వన్డేల్లో 204 వికెట్లు తీశాడు.
ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్
అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా, చెన్నైలో మ్యాచ్
అక్టోబర్ 11: ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీలో మ్యాచ్
అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్, అహ్మదాబాద్ లో మ్యాచ్
అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్, పూణేలో మ్యాచ్
అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్, ధర్మశాలలో మ్యాచ్
అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్, లక్నోలో మ్యాచ్
నవంబర్ 2: భారత్ vs శ్రీలంక, ముంబైలో మ్యాచ్
నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా, కోల్‌కతాలో మ్యాచ్
నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్, బెంగళూరులో మ్యాచ్
Also Read: Table Tennis – Bronze Medal : టేబుల్ టెన్నిస్ డబుల్స్ లో ఇండియాకు కాంస్యం
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటివరకు ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన ఎలా ఉంది..?
1975: గ్రూప్ స్టేజ్
1979: గ్రూప్ స్టేజ్
1983: ఛాంపియన్స్
1987: సెమీఫైనల్స్
1992: రౌండ్-రాబిన్ స్టేజ్
1996: సెమీఫైనల్స్
1999: సూపర్ సిక్స్
2003: రన్నరప్
2007: గ్రూప్ స్టేజ్
2011: ఛాంపియన్స్
2015: సెమీఫైనల్స్
2019: సెమీఫైనల్స్
ప్రపంచకప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.