Site icon HashtagU Telugu

ODI Batting Rankings: ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ ఇవే.. కోహ్లీ ఎన్నో ర్యాంక్‌లో ఉన్నాడంటే?

ODI Batting Rankings

ODI Batting Rankings

ODI Batting Rankings: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుత ఫామ్‌లో క‌న‌ప‌డుతోంది. పాకిస్థాన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టుకు మ‌రింత బ‌లంగా విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్‌పై అద్భుత సెంచరీతో విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ODI Batting Rankings) కూడా దూసుకెళ్లాడు.

విరాట్ నంబర్-5కి చేరుకున్నాడు

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ ఫామ్‌పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అయితేపాకిస్తాన్‌పై విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 51వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ త‌న బ్యాటింగ్ స్థానాల‌ను మెరుగుపర్చుకున్నాడు. ర్యాంకింగ్స్‌లో కోహ్లి ఒక్క స్థానం ఎగబాకాడు. 743 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ ఐదో స్థానానికి చేరుకున్నాడు.

Also Read: Vallabhaneni Vamsi : రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ

గిల్ నంబర్-1లో కొనసాగుతున్నాడు

శుభమన్ గిల్ ఇటీవలి ఫామ్ చాలా అద్భుతంగా ఉంది. గిల్ ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీ సాధించాడు. పాకిస్థాన్‌పై గిల్ 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 817 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ నంబర్‌లో రోహిత్-బాబర్ ఉన్నారు

పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ 770 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 757 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ 749 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా టాప్ 10లో ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్నాడు.

పాకిస్థాన్‌పై 3 వికెట్లు తీసిన కుల్దీప్, షమీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రయోజనం పొందారు. మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. మహ్మద్ షమీ కూడా ఒక స్థానం ఎగబాకాడు. కాగా శ్రీలంక స్పిన్ బౌలర్ మహేశ్ తీక్షణ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Exit mobile version