Heath Streak Alive: నేను బ్రతికే ఉన్నాను

జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ హీత్ స్టీక్ కన్నుమూశారు. 49 ఏళ్ళ స్టీక్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు.

Heath Streak Alive: జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ హీత్ స్టీక్ కన్నుమూశారు. 49 ఏళ్ళ స్టీక్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. పెద్దప్రేగు, కాలేయం క్యాన్సర్ తో హీత్ బాధపడుతున్నాడు. ఈ మధ్య సమస్య ఎక్కువ అవ్వడంతో ఈ రోజు ఉదయం దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇది మొదటి వచ్చిన వార్త. కానీ నేను బ్ర‌తికే ఉన్నాను అని హీత్ స్ట్రీక్ తెలిపాడు. త‌న చావు వార్త‌లు నిజం కాద‌న్నాడు. ఆ వార్త‌ల్ని వ్యాప్తి చేసిన‌వాళ్లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నాడు. హీత్ స్ట్రీక్ మరణవార్తతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ తిన్నది. కానీ ఆ వార్తలో నిజం లేదని తెలిసాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హీత్ స్ట్రీక్ 1993లో జింబాబ్వే క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల కెరీర్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా స్ట్రీక్ రికార్డ్ సృష్టించాడు. జింబాబ్వే తరఫున టెస్టులు, వన్డేల్లో తొలి 100 వికెట్లు తీసిన రికార్డ్ తనపేరిటే ఉండటం గమనార్హం. హీత్ స్ట్రీక్ బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా సత్తాచాటాడు.టెస్టుల్లో 1990 రన్స్, వన్డేల్లో 2943 రన్స్ చేశాడు. 2000 సంవత్సరంలో జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. స్టీక్ సారథ్యంలోనే జింబాబ్వే తొలిసారి విదేశాల్లో టెస్టు సిరీస్ గెలిచింది. 2001 సంవత్సరంలో న్యూజిలాండ్‌ను 2-1తో ఓడించింది. 2005లో చివరగా భారత్‌తో టెస్టు మ్యాచు ఆడి.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Also Read: Woman Drinkers: మద్యం మత్తులో మహిళలు, సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా సర్వే!