Site icon HashtagU Telugu

BCCI: క్రికెటర్లు ఆ యాడ్స్ మానుకోవాలి: మోడీ

BCCI

BCCI

BCCI: లక్షలాది మంది అభిమానులకు రోల్‌ మోడల్స్ గా నిలిచే క్రీడాకారులు పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలు చేస్తున్నారు. తమ ఆదాయాల కోసం ఎంతోమందిని చెడు వ్యసనాలకు బానిసలను చేస్తున్నారు. అభిమాన క్రికెటర్లు చెప్తే ఏదైనా చేసే ఫ్యాన్స్ ఉన్నప్పుడు వారు సూచించిన మద్యం, పొగాకు ఉత్పత్తులని వాడటం సర్వసాధారణం. దీనిపై క్రికెటర్లు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఓ షరతు పెట్టింది.

బీసీసీఐ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఐపీఎల్‌ లేదా ఇతర క్రికెట్‌ మ్యాచ్‌ ల సమయంలో ఆటగాళ్లు పొగాకు, ఆల్కహాల్‌ సంబందించిన అడ్వార్టైజ్మెంట్లపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. అనారోగ్య ఉత్పత్తులకు సంబంధించి క్రికెటర్లు యాడ్స్ లో కనిపించడం వల్ల యువత పై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనల్లో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని బీసీసీఐని కోరింది. బీసీసీఐ నిర్వహించే మ్యాచ్‌ లు, ఐపీఎల్‌ టోర్నీ సమయంలో కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా..ఇతర ప్రముఖులు ఎవరైనా సరే పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్‌ ప్రకటనలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

ఐసీఎంఆర్‌, గ్లోబల్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అధ్యయనాల ప్రకారం గతేడాది జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలోని 17 మ్యాచ్‌ల్లో పొగాకు, మద్యంకి సంబందించిన యాడ్స్ ప్రసారం అయ్యాయి. తద్వారా సదరు ఉత్పత్తులకు భారీ ఆదాయం సమకూరింది. యాడ్స్ లో నటించిన క్రికెటర్లు, ఇతర నటులకు భారీ రెమ్యూనరేషన్ లభించింది. కానీ వాళ్ళను రోల్ మోడల్ గా తీసుకున్న యువత మాత్రం పొగాకు, మద్యానికి బానిసై అనారోగ్యం బారీన పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది యువ‌త ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. తద్వారా బీసీసీఐకి కోట్లలో నష్టం జరుగుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Telangana Assembly : ‘నీ అమ్మ ముసుకో’ అసెంబ్లీ లో దానం బూతు పురాణం

Exit mobile version