IPL Auction 2024: టీమిండియా ప్లేయర్ కు ఊహించని ధర

దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం రసవత్తరంగా సాగుతుంది. ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసులు కుమ్మరిస్తున్నాయి. కొందరిపై ఎన్ని కోట్లయినా పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి.

IPL Auction 2024: దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం రసవత్తరంగా సాగుతుంది. ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసులు కుమ్మరిస్తున్నాయి. కొందరిపై ఎన్ని కోట్లయినా పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి. కాగా ఐపీఎల్ వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జాక్ పాట్ కొట్టాడు. కళ్ళు చెదిరే ధరకు అతడిని పంజాబ్ దక్కించుకుంది. అతడికి అంత ధర లభించడం క్రికెట్ వర్గాలను షాక్ కు గురిచేసింది. నిజానికి ఐపీఎల్ చరిత్రలో మిచెల్ స్టార్క్ సృష్టించాడు.ఆస్ట్రేలియాకు చెందిన అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్ల భారీ ధరకు ప్యాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు భారీ ధర పలికిన ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కావడం విశేషం. ఇక ఈసారి వేలంలో జాక్ పాట్ కొట్టినవాళ్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా ఉన్నాడు. హర్షల్ పటేల్ని పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లకు సొంతం చేసుకుంది. 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన అతని కోసం పంజాబ్, గుజరాత్ టీమ్ లు పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక ధర వెచ్చించి పంజాబ్ టీమ్ దక్కించుకుంది. గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ వేలానికి ముందు హర్షల్ పటేల్ ను ఆర్సీబీ విడుదల చేసింది.

Also Read: Rudraksha Remedy: పెళ్లి కావడం లేదని దిగులు చెందుతున్నారా.. అయితే ఈ రుద్రాక్షలను ధరించాల్సిందే?