Site icon HashtagU Telugu

Fight Breaks : గ్రౌండ్ లో శృతిమించుతున్న పాక్ ఆటగాళ్ల తీరు..

Haris Rauf's Lafda With Abh

Haris Rauf's Lafda With Abh

ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పటిలాగే తీవ్ర ఉత్కంఠతో సాగింది. ముఖ్యంగా టీమ్ ఇండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చి పాకిస్థాన్ బౌలర్ల అగ్రెషన్‌ను తిప్పికొట్టారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ జంట, షాహీన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్ దాడులను ఎదుర్కొని ధాటిగా ఆడారు. మ్యాచ్ మధ్యలో హారిస్ రౌఫ్ బౌలింగ్‌కి గిల్ బౌండరీ కొట్టిన తరువాత అభిషేక్ శర్మ అతడిపై మాటల దాడి చేయగా, రౌఫ్ కూడా దానికి సమాధానమిచ్చాడు. దీంతో అక్కడ వాగ్వివాదం తీవ్రరూపం దాల్చగా, గిల్ కూడా తన జట్టుదొస్తుని సమర్థిస్తూ ముందుకొచ్చాడు. అయితే పరిస్థితి మరింత దిగజారకముందే అంపైర్లు జోక్యం చేసుకొని వారిని విడదీశారు.

14 అడుగుల ఆత్మలింగం, మాణిక్యాంబ శక్తిపీఠం ఆంధ్రాలో ఎక్కడ ఉందో తెలుసా?

అయితే ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. మ్యాచ్‌లో బ్రాడ్‌కాస్ట్ కమర్షియల్స్‌కి మారడంతో టెలివిజన్ ప్రేక్షకులకు కనబడని సన్నివేశం ఒక వీడియో రూపంలో బయటకు వచ్చింది. అందులో టీమ్ ఇండియా ప్లేయర్ రింకు సింగ్ మైదానంలోకి నీరు తీసుకెళ్తూ, గిల్‌ను అటు నుంచి దూరం చేయడం, ఇద్దరు ఓపెనర్లకు సలహాలు ఇవ్వడం కనిపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, రింకు తన చల్లని స్వభావంతో పరిస్థితిని నియంత్రించాడని అభిమానులు ప్రశంసించారు. మరోవైపు హారిస్ రౌఫ్ మాత్రం ఈ సంఘటనల తరువాత కూడా తన ప్రవర్తనలో వెనక్కి తగ్గలేదు.

భారత ప్రేక్షకులు అతనిపై వ్యంగ్యంగా నినాదాలు చేస్తుండగా, సరిహద్దు సంఘటనలతో సంబంధం ఉన్న “0-6” అనే సంకేతాన్ని చూపించాడు. ఇది పాకిస్థాన్ గతంలో ప్రవర్తించిన నిరాధార వాదనలకు సంకేతం. ఆ జెష్చర్ వెంటనే వైరల్ కావడంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మ్యాచ్ ఫలితంగా భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. అభిషేక్ శర్మ (74), గిల్ (47)ల 105 పరుగుల ఓపెనింగ్ జోడీతో బలమైన పునాది పడగా, చివరికి భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం భారత్ ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేయగా, పాకిస్థాన్ ఆటగాళ్ల ఆగ్రహ ప్రదర్శనలు విఫలమయ్యాయి.

Exit mobile version