world cup 2023: లీగ్ మ్యాచులకు హార్దిక్ లేనట్లేనా?

5 విజయాలతో జోరు మీదున్న టీమిండియా తదుపరి మ్యాచ్ లోను సత్తా చాటాలని భావిస్తుంది. 4 మ్యాచులు ఆడి మూడు మ్యాచుల్లో ఓడిన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది

world cup 2023: 5 విజయాలతో జోరు మీదున్న టీమిండియా తదుపరి మ్యాచ్ లోను సత్తా చాటాలని భావిస్తుంది. 4 మ్యాచులు ఆడి మూడు మ్యాచుల్లో ఓడిన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా లక్నో చేరుకుంది. లక్నో చేరుకున్న ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్ సిబ్బంది సాంప్రదాయ పద్దతిలో రోహిత్ సేనకు ఆహ్వానం పలికారు. ఆటగాళ్లు నడిచి వస్తుంటే వారిపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ లో షేర్ చేసింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, శార్డూల్ ఠాకూర్ బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో కనిపించారు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యేలా కనిపిస్తున్నాడు.  పాండ్యా గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు టీమిండియా లక్నో చేరుకుంటే పాండ్య బెంగూరులోనే ఉండిపోయాడు. అయితే పాండ్య ఇంగ్లాండ్ తోనే కాకుండా తదుపరి మూడు మ్యాచ్ లకు కూడా దూరం కాబోతున్నాడట. అంటే పాండ్య లీగ్ మ్యాచులకు దూరంగా ఉండనున్నారు. సెమీఫైనల్, ఫైనల్ వరకు పాండ్య జట్టులోకి ఎంట్రీ ఇవ్వొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Also Read: Pistachio Benefits: చలికాలంలో పిస్తా ప్రయోజనాలు