Pandya Gifts His Son: హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాసా స్టాంకోవిక్, కొడుకు అగస్త్య పాండ్యాకు 4 కోట్ల రూపాయల విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2020లో నటాసాను హార్దిక్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2024లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పాండ్యా ప్రస్తుతం మాహికా శర్మతో డేటింగ్‌లో ఉన్నారు.
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026 ఆడుతున్నారు. మాహికా శర్మ కూడా ఈ సమయంలో హార్దిక్ తోనే ఉన్నారు. రిపోర్ట్స్ ప్రకారం.. పాండ్యా టీమ్ హోటల్‌లోనే మాహికా పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇదే సమయంలో పాండ్యా మాజీ భార్య నటాసా, కొడుకు అగస్త్యకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో వారు ఒక లగ్జరీ కారు డెలివరీ తీసుకుంటూ కనిపిస్తున్నారు.
Also Read: బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!
Hardik Pandya gifted a Defender to “Agastya” ❤️
PAPA TO AGASTYA pic.twitter.com/SR4LU2ma0R— 🇮🇳HARDIK🥋 (@Kunfupandya33) February 22, 2026
కొడుకుకు 4 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్
కారు రిసీవ్ చేసుకునే సమయంలో తీసిన ఫోటోలు, వీడియోల వెనుక ఒక బ్యానర్ కనిపించింది. దానిపై “నాన్న తరపున అగస్త్యకు గిఫ్ట్” అని రాసి ఉంది. హార్దిక్ తన కొడుకుకు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చారు. దీని ధర సుమారు 4 కోట్ల రూపాయలు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మాహికా శర్మతో డేటింగ్‌లో ఉన్నారు. ఇటీవల ఆమె పేరులోని మొదటి అక్షరాన్ని టాటూగా కూడా వేయించుకున్నారు. హార్దిక్ ఆమె పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా బంతితో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పవర్‌ప్లేలో కూడా బౌలింగ్ చేస్తున్నారు. నమీబియాపై ఆయన 52 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 5 వికెట్లు తీశారు. ఈరోజు భారత్ సూపర్-8 రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
