Anil Kumble Birthday : భారత స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే బర్త్‌డే (అక్టోబర్ 17) నేడే. కుంబ్లే దాదాపు 18 ఏళ్లపాటు టీమిండియా కోసం అద్భుతంగా ఆడాడు. 1990 ఏప్రిల్ 25 నుంచి 2008 సంవత్సరంలో రిటైర్ అయ్యే వరకు భారత క్రికెట్‌లో కుంబ్లే తళుక్కుమని మెరిశాడు. ఇవాళ ఆయన 54వ పుట్టినరోజును క్రికెట్ అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈతరుణంలో కుంబ్లే కెరీర్, నెట్ వర్త్‌తో ముడిపడిన ఆసక్తికర విశేషాలివీ..
కుంబ్లే కెరీర్ గురించి..
- అనిల్ కుంబ్లే 1970 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించారు.
- కుంబ్లేకు(Anil Kumble Birthday) మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉంది. ఫొటోగ్రఫీ అంటే ఆయనకు ఇష్టం.
- విద్య, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో కుంబ్లే చురుగ్గా పాల్గొంటుంటారు.
- వన్యప్రాణుల ఫొటోగ్రఫీపై కుంబ్లేకు ఆసక్తి ఎక్కువ. ఇందుకోసం ఆయన ‘జంబో ఫండ్’ను స్థాపించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఈ సంస్థ విరాళాలు ఇస్తుంటుంది.
- 13 ఏళ్ల వయసులో బెంగళూరులోని క్రికెట్ క్లబ్‌లో కుంబ్లే చేరాడు. అక్కడే ఆయన క్రికెట్ నేర్చుకున్నారు. ఇక ఇదే సమయంలో చదువుపై నుంచి ఫోకస్ పోకుండా కుంబ్లే జాగ్రత్తపడ్డారు.
- 1989లో కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి కుంబ్లే అరంగేట్రం చేశారు. ఇదే సమయానికి ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తిచేశారు.
- 1990 ఏప్రిల్ 25న అంతర్జాతీయ క్రికెట్‌లోకి కుంబ్లే అరంగేట్రం చేశారు.
- కుంబ్లేను తోటి ప్లేయర్లు ముద్దుగా ‘జంబో’ అని పిలిచేవారు. కుంబ్లేకు జంబో అనే పేరు పెట్టింది నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగిన ఇరానీ ట్రోఫీలో సిద్ధూ అతడికి ఈ పేరు పెట్టాడు.
- టీమిండియా తరఫున కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు, 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టారు.
- ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత్ తరపున 900కిపైగా వికెట్లు తీసిన ఏకైక బౌలర్ కుంబ్లేనే.
- 1999 ఫిబ్రవరి 7వ తేదీ కుంబ్లే కెరీర్‌లో వెరీ స్పెషల్. ఎందుకంటే ఆ రోజున పాకిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 26.3 ఓవర్లు బౌలింగ్ చేసి కుంబ్లే ఒక్కడే 10 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది.క్రికెట్ చరిత్రలో జిమ్ లేకర్ తర్వాత టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి ఫీట్ చేసిన రెండో బౌలర్‌గా కుంబ్లే నిలిచారు.
Also Read :Tata Nexon Crash Test Rating: క్రాష్ టెస్టులో 5 పాయింట్లు కొల్లగొట్టిన కొత్త టాటా నెక్సాన్!
- 2002లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దవడ విరిగిపోయినప్పటికీ.. కుంబ్లే తలపై కట్టుతో బౌలింగ్ చేసి రాణించాడు.
- అనిల్ కుంబ్లే నికర సంపద విలువ దాదాపు రూ.80 కోట్లు. ఆయనకు ఎండార్స్‌మెంట్‌లు, ఐపీఎల్ కాంట్రాక్టులు, వ్యక్తిగత వ్యాపారం నుంచి ఆదాయాలు వస్తుంటాయి.
- బెంగళూరులో కుంబ్లేకు విలాసవంతమైన ఇల్లు ఉంది.
- దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కుంబ్లేకు అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి.