Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి తన కోపాన్ని బయటపెట్టాడు. యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్, ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటివా అంటూ చుకరకలంటించాడు. అతని మాటలు స్టంప్ మైక్‌లో క్లియర్ గా వినపడ్డాయి. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు అక్కడ ఎం జరిగిందో ఓ సారి చూద్దాం.
కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ సమయంలో మైదానంలో తోటి ఆటగాళ్లను తిట్టడం తరచుగా జరుగుతుంది. మెల్‌బోర్న్ టెస్టులో కూడా రోహిత్ తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు. జడేజా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే స్మిత్ బంతిని కొట్టగా, బంతి అతని వద్దకు రాకముందే జైస్వాల్ గాల్లోకి ఎగరడం చర్చనీయాంశంగా మారింది. పక్కనే ఉండి అంతా గమనిస్తున్న కెప్టెన్ రోహిత్ జైస్వాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీధి క్రికెట్ ఆడుతున్నాడని ఫైర్ అయ్యాడు. ఇది కాస్త స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: CWC Meeting : సోనియాగాంధీకి అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
నాలుగో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా మూడో సెషన్‌లో అద్భుతంగా పునరాగమనం చేశాడు. తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఈ క్రమంలో టాపార్డర్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఉస్మాన్ ఖవాజా (57), సామ్ కొన్‌స్టాస్ (60),మార్నస్ (72), స్మిత్ (68) నాటౌట్ గా నిలిచాడు. ఇందులో బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. మరోవైపు 19 ఏళ్ల సామ్ కొంటాస్ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన కొంటాస్ 65 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. జడేజా వేసిన బంతికి అతను ఔటయ్యాడు.