Gujarat Titans Player Robin Minz : యువ వికెట్ కీపర్ కు యాక్సిడెంట్

ఐపీఎల్ 2024 (IPL 2024)సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌‌(Gujarat Titans)కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్ కీపర్, జార్ఖండ్ ప్లేయర్ రాబిన్ మింజ్ (Robin Minz) రోడ్డు ప్రమాదానికి (Accident) గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా లేనప్పటికీ గాయాలైనట్లు తెలుస్తోంది. తన కవాసకి సూపర్ బైక్‌పై ఒంటరిగా వెళ్తున్న రాబిన్ మింజ్.. అదుపు తప్పి ఎదురుగా వచ్చిన మరో బైకర్‌ను ఢీ కొట్టినట్లు అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు. ఈ […]

Published By: HashtagU Telugu Desk
Robin

Robin

ఐపీఎల్ 2024 (IPL 2024)సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌‌(Gujarat Titans)కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్ కీపర్, జార్ఖండ్ ప్లేయర్ రాబిన్ మింజ్ (Robin Minz) రోడ్డు ప్రమాదానికి (Accident) గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా లేనప్పటికీ గాయాలైనట్లు తెలుస్తోంది. తన కవాసకి సూపర్ బైక్‌పై ఒంటరిగా వెళ్తున్న రాబిన్ మింజ్.. అదుపు తప్పి ఎదురుగా వచ్చిన మరో బైకర్‌ను ఢీ కొట్టినట్లు అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పాడు. రోడ్డుపై పడిపోవడంతో రాబిన్ మింజ్ కుడి మోకాలు కొట్టుకుపోయిందని, బైక్ ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నదని ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు.

We’re now on WhatsApp. Click to Join.

అతను ఐపీఎల్ ప్రీ సీజన్ క్యాంప్‌లో చేరాల్సి ఉంది. కానీ ప్రస్తుత ప్రమాదం అతని చేరికను ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో రాబిన్ మింజ్‌ను గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్ పెద్దగా దేశవాళీ క్రికెట్ ఆడకపోయినా.. 14 టీ20 మ్యాచ్‌ల్లో 148.9 స్ట్రైక్‌రేట్‌తో 353 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడగలిగే సామర్థ్యం ఉండటంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. రాబిన్‌ తండ్రి ఫ్రాన్సిస్‌ మింజ్‌ రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తాడు. కొద్ది రోజుల కిందటే అతను.. గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను కలిసాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటో నెట్టింట వైరలైంది. రాబిన్‌ ఇటీవల కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో క్వార్టర్‌ ఫైనల్లో సెంచరీతో మెరిశాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.

Read Also : Govt Survey Report : విద్య ఖర్చు తగ్గె.. పాన్, పొగాకు, డ్రగ్స్ ఖర్చు పెరిగె

  Last Updated: 03 Mar 2024, 08:24 PM IST