IPL 2024: హార్దిక్ లేకపోయినా టైటిల్ రేసులో గుజరాత్

2022 సీజన్‌ ద్వారా ఐపీఎల్ లో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. అరంగేట్ర సీజన్‌లోనూ టైటిల్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. మేటి జట్లను మట్టికరిపించి

IPL 2024: 2022 సీజన్‌ ద్వారా ఐపీఎల్ లో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. అరంగేట్ర సీజన్‌లోనూ టైటిల్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. మేటి జట్లను మట్టికరిపించి టోర్నీని ముద్దాడింది. గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో కూడా ఫైనల్ చేరింది. అయితే తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓటమి పాలై.. రన్నరప్‌గా నిలిచింది. అయితే హార్దిక్ పాండ్యా వెళ్లిపోయినా ఆ జట్టు కోర్ టీమ్ అంతా అలానే ఉండటంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో వచ్చే సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుతుందని జోస్యం చెప్తున్నారు సీనియర్ ఆటగాళ్లు. ఈ మధ్య దుబాయ్ లో జరిగిన వేలంలో గుజరాత్ టైటాన్స్ కత్తిలాంటి ఆటగాళ్లను చేర్చుకుంది. దేశవాళీలో అద్భుతంగ రాణిస్తున్న హిట్టర్ షారూఖ్ ఖాన్‌ను 7.40 కోట్లకు తీసుకున్న గుజరాత్.. ఆసీస్ లెఫ్టార్మ్ యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్‌‌ను 10 కోట్లకు దక్కించుకుంది. యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్‌కు 3 కోట్లు వెచ్చించింది. వీళ్ళతో పాటు టీమిండియాలో ఒకానొక టైం లో ఓ వెలుగు వెలిగిన వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను 5.80 కోట్లకు రెటైన్ చేసుకుంది. కార్తీక్ త్యాగీని 60 లక్షలకు, పేసర్ సుశాంత్ మిశ్రా కోసం 2.2 కోట్లు ఖర్చు చేసింది.

గుజరాత్ తుది జట్టు చూస్తే శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఓమర్జాయ్, షారుఖ్ ఖాన్ లేదా రాహుల్ తెవాటియా, రషీధ్ ఖాన్, నూర్ అహ్మద్ లేదా స్పెన్సర్ జాన్సన్, మహమ్మద్ షమీ, కార్తీక్ త్యాగీ లేదా ఉమేశ్ యాదవ్ఆర్ మోహిత్ శర్మ లు ఉండే అవకాశముంది. మొత్తానికి ఇతర జట్లతో పోలిస్తే గుజరాత్ జట్టు బలంగా ఉందంటున్నారు మాజీలు. అందరూ సరిగ్గా రాణిస్తే గుజరాత్ కు కప్ కొట్టడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు. చూడాలి వచ్చే సీజన్లో గుజరాత్ ఏ మేర రాణిస్తుందో.

Also Read: Hari Hara Veeramallu: వీరమల్లు చిత్రంపై కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్