గుజరాత్ ను మడతపెట్టేసిన ఢిల్లీ బౌలర్లు.. 6 వికెట్ల తేడాతో పంత్ టీమ్ ఘన విజయం

ఐపీఎల్ 17వ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ మెల్లిగా పుంజుకుంటోంది. గత మ్యాచ్ లో లక్నో పై గెలిచిన ఆ జట్టు తాజాగా గుజరాత్ ను చిత్తు చేసింది.

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 11:02 PM IST

ఐపీఎల్ 17వ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ మెల్లిగా పుంజుకుంటోంది. గత మ్యాచ్ లో లక్నో పై గెలిచిన ఆ జట్టు తాజాగా గుజరాత్ ను చిత్తు చేసింది. బౌలర్లు చెలరేగడంతో గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. గుజరాత్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై ఎదురుదాడికి దిగి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఇషాంత్‌ శర్మ , ముకేశ్‌ కుమార్‌ , ట్రిస్టన్‌ స్టబ్స్‌ ధాటికి కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్‌ పతనంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌ 31 రన్స్ తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్‌ , తెవాటియా మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అసలు ఏ దశలోనూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేకపోయారు. దీంతో గుజరాత్ ఇన్నింగ్స్ 17.3 ఓవర్లలోనే ముగిసింది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇదే అత్యల్ప టీమ్‌ స్కోర్‌. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 100లోపు ఆలౌట్‌ కావడం ఇదే మొదటిసారి.

We’re now on WhatsApp. Click to Join.

చేజింగ్ లో ఢిల్లీ కాపిటల్స్ దూకుడుగా ఆడింది. రన్ రేట్ పెంచుకునే ఉద్దేశంతో వేగంగా టార్గెట్ అందుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో 4 వికెట్లు కోల్పోయింది. పృథ్వి షా త్వరగానే ఔట్ అయినా ఫ్రేజర్ 20, హోప్ 19 , పంత్ 16 పరుగులతో రాణించారు. ఢిల్లీ 8.5 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఆ జట్టుకు ఇది మూడో విజయం. తాజా గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. మరోవైపు గుజరాత్ కి ఇది నాలుగో ఓటమి.
Read Also : YouTuber Died: పాపులర్ యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మాన్ మృతి