Shubman Gill: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది. నాల్గవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్సీపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను గిల్‌కు ఇంగ్లాండ్‌లో విజయం సాధించే ఫార్ములాను అందించాడు. భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఎలా గెలవగలదో వివరించాడు.
గ్రెగ్ చాపెల్ శుభ్‌మన్ గిల్‌కు ఇచ్చిన ఫార్ములా ఇదే
గ్రెగ్ చాపెల్ ESPNcricinfoలో ఒక కథనం రాశాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కేవలం బౌలింగ్ లేదా ఫీల్డింగ్‌లో మార్పులు చేయడమే కాదు. మైండ్‌సెట్‌ను కూడా నిర్ణయిస్తాడని చాపెల్ చెప్పాడు. ఈ దిగ్గజం మాట్లాడుతూ.. గిల్ కష్ట సమయంలో కూడా ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలని అన్నాడు. గిల్ తాను భారత జట్టును ఎలాంటి జట్టుగా చూపించాలనుకుంటున్నాడో స్పష్టం చేయాలి. కెప్టెన్ కేవలం మాటలతో కాదు, చేతలతో చూపించాలి. భారత్ బలహీనమైన ఫీల్డింగ్ జట్టుగా మిగిలిపోకూడదు. ఉత్తమ జట్లు ఫీల్డ్‌పై అద్భుతంగా ఉంటాయి. వారు సులభంగా రన్స్ ఇవ్వరు. క్యాచ్‌లను వదలరని పేర్కొన్నారు.
Also Read: Health Warning: పిజ్జా, బర్గర్‌లు తెగ లాగిస్తున్నారా? అయితే ఈ సమస్యలకు వెల్‌కమ్ చెప్పినట్లే!
బ్యాట్‌తోనే కాదు, మాటలతో కూడా జట్టును ప్రేరేపించాలి
గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ.. సంభాషణ విషయంలో గిల్ మెరుగవ్వాలని చెప్పాడు. మాట్లాడుతూ.. గొప్ప కెప్టెన్లు ఎల్లప్పుడూ సమర్థవంతంగా సంభాషిస్తారు. గిల్ అలాంటి వ్యక్తిగా త్వరగా మారాలి. అది శిక్షణ సమయంలోనైనా, మ్యాచ్ సమయంలోనైనా లేదా డ్రెస్సింగ్ రూమ్‌లోనైనా సరే. శాంతంగా, స్పష్టంగా సంభాషించాలి. అతని బ్యాట్ ఎల్లప్పుడూ పరుగులు సాధించలేదు. అతను జట్టును ఒకచోట చేర్చే, అందరిలో విశ్వాసం, నమ్మకం కలిగించే విధంగా మాట్లాడాలి. అతను సరైన చర్యలు తీసుకోవాలి. బ్యాట్స్‌మెన్‌లు సానుకూలంగా బ్యాటింగ్ చేయాలని, భాగస్వామ్యాలు ఏర్పరచాలని చెప్పాలి. బౌలర్లు కేవలం వికెట్లు తీసుకోవడమే కాదు, ఒత్తిడి కూడా సృష్టించాలని తెలుసుకోవాలి. ఒత్తిడి పెరిగితే తప్పులు జరుగుతాయి అని చాపెల్ వివరించారు.
నాల్గవ టెస్ట్ ఎప్పుడు?
భారత్- ఇంగ్లాండ్ మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ జులై 23, 2025 నుండి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత జట్టు ప్రస్తుతం సిరీస్‌లో వెనుకబడి ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే, నాల్గవ మ్యాచ్‌ను భారత్ తప్పక గెలవాలి.