Pakistan Coach: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన గ్రాంట్ బ్రాడ్‌బర్న్..!

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు గ్రాంట్ బ్రాడ్‌బర్న్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వైదొలిగారు. అతను పాకిస్తాన్‌కు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌ (Pakistan Coach)గా ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 01:30 PM IST

Pakistan Coach: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు గ్రాంట్ బ్రాడ్‌బర్న్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వైదొలిగారు. అతను పాకిస్తాన్‌కు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌ (Pakistan Coach)గా ఉన్నాడు. గత ఏడాదిలో వివిధ సందర్భాల్లో మిక్కీ ఆర్థర్ గైర్హాజరీలో అతను పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ బాధ్యతలను కూడా నిర్వహించాడు. బ్రాడ్‌బర్న్ 2018 నుండి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను 2018 నుండి 2020 వరకు పాకిస్తాన్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ పాత్రను పోషించాడు. దీని తర్వాత 2020లో అతను హై పెర్ఫార్మెన్స్ కోచింగ్‌కి అధిపతిగా నియమితుడయ్యాడు.

గతేడాది సక్లైన్ ముస్తాక్ స్థానంలో పాకిస్థాన్ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అతను ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్, శ్రీలంకలో టెస్ట్ టూర్ కూడా చేసాడు. వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టుతో కలిసి భారత్‌కు కూడా వచ్చాడు. అతను అప్పటి పాకిస్తాన్ జట్టు డైరెక్టర్ మిల్లీ ఆర్థర్‌తో కలిసి పనిచేశాడు.

ప్రపంచ కప్ 2023 నుండి పాకిస్తాన్ ముందుగానే నిష్క్రమించిన తర్వాత కోచింగ్ స్థానాల్లో పునర్వ్యవస్థీకరణ జరిగింది. అయితే బ్రాడ్‌బర్న్, ఆర్థర్ ఇద్దరూ అధికారికంగా పదవి నుండి తొలగించబడలేదు. అయితే వీరిద్దరూ పాక్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లలేదు. ఇక్కడ మహ్మద్ హఫీజ్ జట్టుకు డైరెక్టర్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు గ్రాంట్ 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత PCBతో విడిపోయారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.

Also Read: Sanju Samson: మూడు టీ20ల సిరీస్‌కు సంజూ శాంసన్‌.. ఈసారైనా రాణిస్తాడా..?

గ్రాంట్ బ్రాడ్‌బర్న్ ఇలా వ్రాశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో స్వర్ణ అధ్యాయాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. ఐదేళ్లపాటు త్రిపాత్రాభినయం చేసే అవకాశం వచ్చింది. ఈ సమయంలో నేను సాధించిన దాని గురించి నేను గర్వపడుతున్నాను. ఇంత గొప్ప ఆటగాళ్ళు, కోచ్‌లు, సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించినందుకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

బ్రాడ్‌బర్న్ గ్లామోర్గాన్‌లో చేరాడు

గ్రాంట్ బ్రాడ్‌బర్న్ ఇప్పుడు గ్లామోర్గాన్‌లో చేరారు. అతను గ్లామోర్గాన్ ప్రధాన కోచ్‌గా మూడేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు. వచ్చే నెల నుంచి ఆయన బాధ్యత తీసుకోనున్నారు. అతను ఈ వేల్స్ కౌంటీకి ప్రతి ఫార్మాట్‌లో ప్రధాన కోచ్‌గా ఉంటాడు.