పురుషుల హాకీ ప్రపంచకప్ (Hockey World Cup 2023) సంబరం ముందే వచ్చేసింది. మ్యాచ్‌ల నిర్వహణ కంటే రెండు రోజుల ముందుగానే ఈ మెగా టోర్నీ ఆరంభోత్సవ వేడుకలు జరిగాయి. బుధవారం ఒడిషాలోని బారాబతి స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఒడిషా సంప్రదాయ నృత్యాలు, సంగీతంతో కళాకారులు అలరించారు. బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్, దిశా పటానీ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కటక్ లోని బారాబతి స్టేడియంలో పురుషుల ప్రపంచకప్ ప్రారంభ వేడుకను మొదలుపెట్టారు.
మనదేశ సంస్కృతి, ఉత్సవం, క్రీడాస్ఫూర్తి ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం అనేక సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. బాలీవుడ్ నటి దిశా పటానీ తన అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి సెలబ్రేషన్స్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది. కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, పలువురు సీనియర్ మంత్రులు, రాష్ట్ర అధికారులు, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, హాకీ ఇండియా 50,000 మంది సమక్షంలో వేడుకలు జరిగాయి. . ఈ ఫంక్షన్‌కి ‘సెలబ్రేషన్స్’ అని పేరు పెట్టారు.
Also Read: Team India: ఈడెన్‌లో సిరీస్ టార్గెట్‌గా టీమిండియా
2023 పురుషుల ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి. జనవరి 13 నుంచి 29 వరకు పోటీలు జరుగుతాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే 16 దేశాలలో అనేక దేశాలు భారత్ చేరుకున్నాయి. జనవరి 13న జరుగనున్న పూల్ మ్యాచ్‌లతో యాక్షన్ ప్రారంభమవుతుంది. జనవరి 29న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో ఈ టోర్నీ ముగుస్తుంది. FIH టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వటం ఇది నాలుగవ సందర్భం. ముంబయి 1982, ఢిల్లీ 2010, ఒడిశా 2018 ఈ ఈవెంట్‌ను చివరిగా మూడు సార్లు భారత్ నిర్వహించింది.
బెల్జియం 2023 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. 2023 ప్రపంచ కప్ 1971లో ప్రారంభమైనప్పటి నుండి పురుషుల టోర్నమెంట్ 50 సంవత్సరాలను కూడా జరుపుకుంటుంది. వరుసగా రెండుసార్లు హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. భారతదేశంలోని ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా అనే రెండు నగరాల్లో పురుషుల హాకీ ప్రపంచ కప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. 1982 నుండి భారతదేశం గత ఒలింపిక్స్ నుండి పతక విజేతగా హాకీ ప్రపంచ కప్‌లో ఆడటం ఇదే మొదటి సందర్భం.