Site icon HashtagU Telugu

RCB Fans: ఆర్సీబీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కెప్టెన్ ఎవరో తెలుసా..?

RCB Fans

RCB Fans

RCB Fans: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టును వీడిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ గూటికి చేరాడు. హైదరాబాద్ ఫ్రాంచైజీ భువిని నిలబెట్టుకోకపోవడంతో మెగా వేలంలో ప‌ది కోట్ల‌కు భువ‌నేశ్వ‌ర‌న్‌ను ఆర్‌సీబీ (RCB Fans) సొంతం చేసుకున్న‌ది. వేలంలో భువీ కోసం చాలా జట్లే పోటీ పడ్డాయి. ప‌ది కోట్ల యాభై ల‌క్ష‌ల‌కు ల‌క్నో సొంతం చేసుకోవాలని చూడగా చివ‌ర‌లో ఎంట్రీ ఇచ్చిన ఆర్‌సీబీ 10.75 కోట్ల‌కు బీడ్ వేసింది. దాంతో భువీ బిడ్ క్లోజ్ అయింది. మొత్తానికి భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ జట్టుకు బద్దశత్రువుగా భావించే ఆర్సీబీలో చేరాడు. అయితే ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ ఇంకా ఖరారు కాలేదు.

ఆర్సీబీ మెగావేలంలో కెప్టెన్సీ మెటీరియల్ ప్లేయర్‌ను కొనుగోలు చేయలేదు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్‌లను తీసుకుంటుందని భావించినా అది సాధ్యపడలేదు. అయితే ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్‌ను కెప్టెన్‌ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నట్టు తెలుస్తుంది. దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఒకటి దొరికింది.తాజాగా బెంగళూరు చేరుకున్న భువీ ఆర్సీబీ సహాయక సిబ్బందిని కలిశాడు. దీనికి సంబందించిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ సమావేశంలో ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ కూడా పాల్గొన్నాడు.

Also Read: Pemmasani: ఏపీ రైతుల కోసం పెమ్మసాని కీల‌క డిమాండ్‌!

భువీ ప్రస్తుతం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్‌ ప్రదేశ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రీక్వార్టర్‌ఫైనల్ 2 మ్యాచ్‌లో భువీ ఆంధ్రప్రదేశ్‌తో ఆడాల్సి ఉంది. జార్ఖండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భువీ అద్భుత ప్రదర్శన చేసి హ్యాట్రిక్ సాధించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో భువీ 4 ఓవర్ల స్పెల్‌లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు, అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది.

ఐపీఎల్ కి ముందు భువనేశ్వర్ ఆర్సీబీ సహాయక సిబ్బందిని కలవడం చర్చనీయాంశమైంది. పైగా ఈ డిన్నర్ కి ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ రావడం సంచలనంగా మారింది. దీంతో ఆర్సీబీకి తదుపరి కెప్టెన్ అన్న పాయింట్ ప్రస్తుతం తెరపైకి వచ్చింది. నిజానికి భువిని కెప్టెన్ చేయడాన్ని అందరూ హర్షిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. సో భువీ సీనియారిటీ కూడా ఆర్సీబీ కెప్టెన్గా నిలబెట్టే ఛాన్స్ ఉంది.