Glenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 వరల్డ్ కప్ హీరో మాక్స్‌వెల్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 149 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 3390 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు సాధించాడు. రిటైర్మెంట్ గురించి సమాచారం ఇస్తూ 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను తెలిపాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. నేను బహుశా చాంపియన్స్ ట్రోఫీ మొదటి కొన్ని మ్యాచ్‌ల తర్వాత వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను ఆ మ్యాచ్‌ల కోసం నన్ను ఫిట్‌గా, సిద్ధంగా ఉంచడానికి మంచి అవకాశం ఇచ్చానని భావించాను. లాహోర్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌ను మేము కఠినమైన ఔట్‌ఫీల్డ్‌పై ఆడాము. ఆ మ్యాచ్ తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను అని మాక్స్‌వెల్ చెప్పుకొచ్చారు.
గ్లెన్ మాక్స్‌వెల్ ఈ పాడ్‌కాస్ట్‌లో 2023 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన తన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఆ మ్యాచ్‌లో ఔట్‌ఫీల్డ్ తడిగా ఉంది. అక్కడ మేము 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాము. అక్కడ జారే పరిస్థితి ఉంది. మునుపటి మ్యాచ్ తర్వాత నేను సరిగ్గా సిద్ధం కాలేదు. వన్డే క్రికెట్‌లో నాకు సరైన పరిస్థితులు లేకపోతే నా శరీరం దాన్ని ఎదుర్కోవడానికి సంఘర్షిస్తుందని నాకు అనిపించడం మొదలైంది. అక్కడ ఉండడమే కష్టమైన పని. నా శరీరం పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్న తీరు నన్ను నిరాశపరిచింది. నా జట్టును కూడా నేను నిరాశపరిచానని భావించాను అని అన్నారు.
Also Read: Tragedy : బీహార్‌లో దారుణం.. 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం.. ఆస్పత్రికి వెళితే..!
2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం
మాక్స్‌వెల్‌కు 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని తన స్థానంలో మరో ఆప్షన్‌ను కనుగొని.. దానిపై పని చేయాలని అనిపించింది. ఈ విషయంపై అతను చైర్మన్ జార్జ్ బెయిలీతో మాట్లాడాడు. మేము 2027 వరల్డ్ కప్ గురించి మాట్లాడాము. నేను 2027 వరల్డ్ కప్ ఆడగలనని అనుకోవడం లేదని అతనికి చెప్పాను. ఇప్పుడు నా స్థానంలో ఇతర ఆప్షన్‌లను సిద్ధం చేయడానికి వారితో కలిసి పని చేయడానికి సమయం వచ్చిందని నాకు అనిపిస్తోంది. వారు (ఆప్షన్ పర్సన్) 2027 వరల్డ్ కప్‌లో నా స్థానంలో ఆడగలరని మాక్సీ చెప్పారు.
మాక్స్‌వెల్ తన వ్యక్తిగత స్వార్థం కోసం మరికొన్ని సిరీస్‌లు ఆడాలని అనుకోలేదని చెప్పాడు. మాక్స్‌వెల్ IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. కానీ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా మంచిగా లేదు. 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.