Ravi Shastri: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ప్రస్తుతం సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2 మ్యాచ్ లు గెలిచి భారత్ పై ఆధిక్యం ప్రదర్శించింది. సిరీస్‌లోని చివరి టెస్టు రేపు జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ కెప్టెన్ రోహిత్‌ను తుది జట్టులో ఉంచాలనుకోవట్లేదని చెప్పాడు . అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిందేమి లేదు. ఈ సిరీస్ లో రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. రెండంకెల స్కోర్ చేయడానికి ఆపసోపాలు పడ్డాడు. ముఖ్యంగా తనకు బాగా నచ్చిన ఫుల్ షాట్ ని ఆడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్ లో రోహిత్ 31 పరుగులు మాత్రమే చేశాడంటే హిట్ మ్యాన్ ఫామ్ ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
సిడ్నీ టెస్ట్ భారత్ కు అత్యంత కీలకంగా మారిన వేళ రోహిత్ ని పక్కనపెట్టే ఆలోచనలో గంభీర్ ఉన్నట్లు తెలుస్తుంది. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ రోజు పిచ్‌ని బట్టి రోహిత్ ని ఆడించాలా వవద్ద అనేది డిసైడ్ చేస్తామని గంభీర్ పేర్కొన్నాడు. ఈ సమాధానంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు గంభీర్ ఆజ్యం పోశాడు. ఇప్పుడు ఈ విషయంపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) స్పందించాడు. రోహిత్ రిటైరైతే అదేమీ పెద్ద విషయం కాదని అంటున్నారు. రోహిత్‌కు 37 ఏళ్లు కావడం, అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం వల్ల శుభ్‌మన్ గిల్ లాంటి ఆటగాడు బయట ఉండాల్సి వస్తుందని శాస్త్రి చెప్పాడు. 2024లో 40 సగటు కంటే ఎక్కువ ఉన్న గిల్ వంటి యువ ఆటగాళ్ళు వేచి ఉన్నారు. నాణ్యమైన ఆటగాడు బెంచ్‌పై కూర్చోవడం ఆశ్చర్యపరుస్తుందని శాస్త్రి తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Also Read: NTR Video: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మొన్న ప్రభాస్, నేడు ఎన్టీఆర్!
మరోవైపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో కెప్టెన్ రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చాడు. కానీ అతను మైదానంలో భిన్నంగా కనిపించాడు. రోహిత్ ఎక్కువసేపు మైదానంలో ప్రాక్టీస్ చేయలేదు. జస్ప్రీత్ బుమ్రా మాత్రమే అతనితో మాట్లాడటం కనిపించింది. రోహిత్ ని చూస్తుంటే టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో గొడవ జరిగినట్లు అనిపించింది. మెల్‌బోర్న్ టెస్ట్ ఓడిన తర్వాత గంభీర్ టీమిండియాకు క్లాస్ పీకినట్లు వార్తలువచ్చాయి. అయితే అవి తప్పుడు వార్తలు అంటూ, అలాంటిదేమి లేదని గంభీర్ చెప్పాడు. మ్యాచ్‌ను క్యాజువల్‌గా తీసుకున్న ఆటగాళ్లకు కొన్ని టిప్స్ ఇచ్చానని చెప్పాడు. గత 6 నెలల్లో అందరూ తమ సహజమైన ఆట పేరుతో జట్టుకు అన్యాయం చేశారని గంభీర్ పేర్కొన్నాడు. బ్యాడ్ షాట్లు ఆడుతూ వికెట్లు కోల్పోన విషయాన్నీ గుర్తు చేశాడు. ఇకపై అలా జరిగే అవకాశం ఏమాత్రం ఉండదని గంభీర్ చెప్పాడు.