Site icon HashtagU Telugu

Gautam Gambhir: క‌థ‌లు ప‌డ‌కుండా దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందే: గంభీర్

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రంగంలోకి దిగాడు. ఇంకా తాను బాధ్యతలు తీసుకోకముందే తన మార్క్ ని చూపిస్తున్నాడు. తన బుర్రల్లో ఉన్నదాన్ని బీసీసీఐకి చెప్పి జట్టులో ప్రక్షాళన మొదలుపెడుతున్నాడు. వాస్తవానికి ఈ నెల చివర్లో శ్రీలంకతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది.ఈ టూర్ ద్వారా గంభీర్‌ అధికారికంగా జట్టు బాధ్యతలు తీసుకుంటాడు. అంతకుముందే టెస్టు క్రికెట్‌ పై తన మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు.

ఆటగాళ్లు బెసిక్‌ లెవెల్‌ నుంచి స్ట్రాంగ్‌గా ఉండాలని గంభీర్‌ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాడు. కొందరు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తర్వాత దేశవాళి క్రికెట్‌ను పూర్తిగా మర్చిపోతున్నారు. హర్ధిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఆటగాళ్లు ఇదే కోవకు చెందుతారు. ఇలాంటి ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకే గంభీర్‌ కొత్త రూల్స్‌ తీసుకురానున్నాడు. తాజాగా గంభీర్ చెప్పినట్టుగానే బీసీసీఐ ఓ నియమాన్ని ప్రకటించింది. ఆగ‌స్ట్ నెల‌లో జ‌రిగే దులీఫ్ ట్రోఫీలో టీమ్ఇండియా టెస్ట్‌ జట్టులోని రెగ్యులర్ స‌భ్యులు ఆడాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఖ‌చ్చితంగా ఒక్కొ ఆట‌గాడు ఒక‌టి లేదా రెండు మ్యాచులు ఆడాలని సూచించింది.

విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌కు బీసీసీఐ మిన‌హాయింపు ఇచ్చింది. కీల‌క ఆట‌గాళ్లు అయినా ఈ ముగ్గురు గాయాల బారిన ప‌డ‌కుండా ఉండేందుకే ఈ మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. కాగా సెప్టెంబ‌ర్‌లో స్వదేశంలో భారత్ బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ జరగనుంది. ఆ త‌రువాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచుల సిరీస్, అనంత‌రం టీమ్ఇండియా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుంది. అక్క‌డ నవంబ‌ర్ 22 నుంచి జ‌న‌వ‌రి 7 మ‌ధ్య‌లో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. జూన్‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ఆడాలంటే.. టీమ్ఇండియా ఆడ‌నున్న సిరీస్‌లోని మ్యాచుల్లో వీలైన‌న్ని ఎక్కువ టెస్టు మ్యాచులు గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ బీసీసీఐతో కలిసి జట్టుని మరింత బలంగా మార్చే పనిలో పడ్డాడు.

Also Read: Sardar 2 : కార్తీ సర్దార్ 2 సెట్‌లో ప్రమాదం.. స్టంట్ మెన్ మరణం..