Site icon HashtagU Telugu

Gautam Gambhir: వైరల్ అవుతున్న గంభీర్ కేకేఆర్ వీడ్కోలు వీడియో

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: టీమిండియా హెడ్ కౌచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత్ తొలిసారిగా శ్రీలంకతో తలపడనుంది. గంభీర్ కౌచ్ గా వ్యవహరిస్తున్న తొలి సిరీస్ కావడంతో ఫ్యాన్స్ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గంభీర్ మెంటర్ గా వ్యవహరించిన లక్నో, కేకేఆర్ జట్లను ఎలా ముందుకు తీసుకెళ్లాడో చూశాం. ఆయన హయాంలో ఒక జట్టు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గంభీర్ లాంటి హార్డ్ కౌచ్ ని వదులుకున్నందుకు కేకేఆర్ ఇంకా బాధపడుతూనే ఉంది.

తాజాగా కేకేఆర్ ఫ్యాన్స్ కోసం గంభీర్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అంతేకాదు తనకు కేకేఆర్ పై ఉన్న గౌరవాన్ని వీడియోలో రూపంలో చూపించాడు. కోల్‌కతా అభిమానులు ఏడిస్తే.. నేను ఏడుస్తాను. మీరు గెలిస్తే, నేను గెలుస్తాను, మీరు ఓడితే, నేను ఓడినట్టే, మీరు కలలు కంటే, నేను కలలు కంటున్నాను, మీరు సాధిస్తే, నేను సాధిస్తాను. నేను మిమ్మల్ని నమ్మి మీతో చేరాను, మనందరం ఒకటే. నా మనసులో మీరెప్పుడూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కొత్త కథ రాయడానికి సమయం ఆసన్నమైంది. అయితే అది కేకేఆర్ లాగ పర్పుల్ కలర్‌లో ఉండదు. అది బ్లు కలర్లో ఉంటుంది. ఇది గంభీర్ వీడియో సారాంశం.

రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో కేకేఆర్ అభిమానులతో పాటు టీమ్ ఇండియా అభిమానులకు గూస్‌బంప్‌ తెప్పించింది. ముఖ్యంగా కేకేఆర్ ఫ్యాన్స్ అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. కోల్కతపై గంభీర్ ప్రేమను చూసి ఎమోషనల్ అవుతున్నారు. గంభీర్ లాంటి బలమైన మెంటర్ ని మిస్ చేసుకున్నాం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ 2012 మరియు 2014 ఎడిషన్లలో ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత అంటే 2024లో కేకేఆర్ మళ్ళీ టైటిల్ నెగ్గింది. ఈ సారి గౌతమ్ గంభీట్ మెంటర్ గా వ్యవహరించాడు. ఏదేమైనప్పటికీ కేకేఆర్ దశ, దిశని మార్చింది గంభీర్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: Priyanka Gandhi : ప్రియాంకకు 7 లక్షల మెజారిటీ టార్గెట్.. వయనాడ్ బైపోల్‌కు కాంగ్రెస్ కసరత్తు