టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాకు ఒలింపిక్ మెడల్ అందించాలని కోరుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 2026 టీ20 వరల్డ్ కప్‌లో బిజీగా ఉన్నారు. జూలై 2026లో భారత కోచ్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన గంభీర్ పదవీకాలం ఇప్పటివరకు అనేక ఒడిదుడుకులతో సాగింది. టీమ్ ఇండియా కోచ్ కాకముందు ఐపీఎల్ 2024లో మెంటార్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ట్రోఫీని అందించారు. ఆ విజయమే అతనికి భారత హెడ్ కోచ్ పదవి దక్కేలా చేసింది. అయితే ఇప్పుడు ఆయనకు మళ్లీ ఐపీఎల్‌లోకి తిరిగి వచ్చే అవకాశం లభించింది.

రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ ఆఫర్లు

రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు అమ్మకానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే దానికి కొత్త యజమానులు రాబోతున్నారు. ‘దైనిక్ జాగరణ్’ నివేదిక ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమానులు గౌతమ్ గంభీర్‌ను తమ జట్టుతో చేర్చుకోవాలని భావిస్తున్నారు. వారు గంభీర్‌కు ఒకటి కాదు, ఏకంగా మూడు ఆఫర్లు ఇచ్చారు.

Also Read: ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • పార్ట్‌నర్ (భాగస్వామి)
  • మెంటార్
  • CEO

గంభీర్‌కు ఉన్న టీమ్ మేనేజ్‌మెంట్ అనుభవం దృష్ట్యా రాజస్థాన్ రాయల్స్ అతనికి ఈ కీలక బాధ్యతలను ఆఫర్ చేస్తోంది.

ప్రస్తుతానికి ఈ ఆఫర్ స్వీకరించడం అసాధ్యం

లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర ప్రయోజనాల సంఘర్షణ) కారణంగా టీమ్ ఇండియా కోచ్‌గా ఉంటూ ఐపీఎల్ జట్టుతో పనిచేయడం సాధ్యం కాదు. టీమ్ ఇండియా కోచ్ ఏకకాలంలో ఐపీఎల్ జట్టుకు పార్ట్‌నర్‌గా, మెంటార్‌గా లేదా సీఈఓగా ఉండకూడదు.

గంభీర్ పదవీకాలం 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత ముగుస్తుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఈ ఆఫర్‌ను 2028 వరకు అలాగే ఉంచితే భారత జట్టుతో తన బాధ్యతలు ముగిసిన తర్వాత గంభీర్ తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ఒలింపిక్ మెడల్ సాధించడమే లక్ష్యం

ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాకు ఒలింపిక్ మెడల్ అందించాలని కోరుకుంటున్నారు. గంభీర్ కోచింగ్‌లో భారత్ టీ20, వన్డే వరల్డ్ కప్‌లు గెలిస్తే అతని పదవీకాలాన్ని 2028 ఒలింపిక్స్ వరకు పొడిగించే అవకాశం ఉంది.

  Last Updated: 17 Feb 2026, 01:42 PM IST