Site icon HashtagU Telugu

IND vs SL: గంభీర్ పర్యవేక్షణలో చమటోడుస్తున్న కుర్రాళ్ళు

IND vs SL

IND vs SL

IND vs SL:  మూడు టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టు సోమవారం శ్రీలంక బయలుదేరింది. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీ20 సిరీస్‌కు సన్నాహాలు ప్రారంభించింది. భారత జట్టు ప్రాక్టీస్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

లంకను తగలబెట్టేందుకు భారత ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని ఈ వీడియోల్లో చూడవచ్చు. తమ ప్రిపరేషన్‌లో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టకూడదనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే భారత ఆటగాళ్లు మైదానంలో విపరీతంగా చెమటోడ్చారు. భారత జట్టు ప్రాక్టీస్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేసింది. ఈ వీడియోల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ర్యాన్ పరాగ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, రింకూ సింగ్ ఉన్నారు.బౌలింగ్ మరియు బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయంలో గంభీర్ తనదైన రీతిలో ఆటగాళ్లను ట్రైన్ చేస్తున్నాడు. జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

VIDEO: https://x.com/i/status/1815680629998227497

టీ20 సిరీస్ షెడ్యూల్:
మొదటి టీ20:జూలై 27న పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

2వ టీ20:జూలై 28న పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

3వ టీ20: జూలై 30న పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

టీ20 సిరీస్ భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణో అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

Also Read: AP Assembly : కూటమి ప్రభుత్వానికి ఎవరైనా ఇబ్బందులు కలుగజేస్తే ..అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు