Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ పోరు గత ఆదివారం (మార్చి 8) భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ విజయం తర్వాత పలువురు దిగ్గజాలు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భారత్‌కు తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఉన్నారు. అయితే మాహీ పెట్టిన పోస్ట్‌పై గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో తరచుగా గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోనీ మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం జరుగుతుంటుంది. అయితే వీరిద్దరూ ఎప్పుడూ ఒకరిపై ఒకరు మనస్పర్థల గురించి నేరుగా మాట్లాడలేదు. ఇప్పుడు మాహీ పోస్ట్‌పై గంభీర్ కామెంట్ చూసి ఫ్యాన్స్ అంతా షాక్‌కు గురవుతున్నారు.
Look what all the World Cup win has given us. A heartwarming Thala x Gauti moment on Instagram. We have seen it all! 🥹😂 pic.twitter.com/CHlpgZBkkL
— Mama (@SriniMaama16) March 9, 2026
ధోనీ పోస్ట్‌లో గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేక ప్రస్తావన
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మాహీ తన పోస్ట్‌లో కోచ్ సబ్ అంటే గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అయితే ధోనీ ఎక్కడా గంభీర్ పేరును నేరుగా వాడలేదు. కోచ్ గురించి మాట్లాడుతూ.. “కోచ్ సాహబ్, మీ ముఖంపై చిరునవ్వు చాలా బాగుంది. ఆ నవ్వుతో కూడిన గాంభీర్యం అద్భుతమైన కలయిక” అని ధోనీ పేర్కొన్నాడు.
Also Read: ఐపీఎల్ 2026 షెడ్యూల్.. మార్చి 28న తొలి మ్యాచ్?
గౌతమ్ గంభీర్ సమాధానం
మాహీ చేసిన ఈ పోస్ట్‌కు గౌతమ్ గంభీర్ కామెంట్ రూపంలో సమాధానమిచ్చాడు. భారత హెడ్ కోచ్ స్పందిస్తూ.. “మరి నవ్వడానికి ఇంతకంటే మంచి కారణం ఏముంటుంది? మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది!” అని రాశాడు. సుమారు 3 గంటల క్రితం గంభీర్ చేసిన ఈ కామెంట్‌కు అప్పుడే 58 వేలకు పైగా లైకులు వచ్చాయి.
వైట్ బాల్ క్రికెట్‌లో గంభీర్ కోచింగ్ మ్యాజిక్
వైట్ బాల్ క్రికెట్‌లో గౌతమ్ గంభీర్ కోచింగ్ టీమ్ ఇండియాకు ఇప్పటి వరకు చాలా విజయవంతంగా సాగుతోంది. అంతకుముందు గంభీర్ కోచింగ్‌లోనే టీమ్ ఇండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు తాజాగా ఆయన పర్యవేక్షణలోనే భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
