Gary Ballance: జింబాబ్వే స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జింబాబ్వే అటగాడు గ్యారీ బ్యాలెన్స్ తీసుకున్ననిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. జింబాబ్వే జట్టుకు ముందు గ్యారీ ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు.
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు మొత్తం 26 మ్యాచ్‌లు జరిగాయి. రోజురోజుకు ఉత్కంఠభరితమైన పోటీ కనిపిస్తూనే ఉంది. అయితే ఈ క్రమంలో ఓ ఆటగాడు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ మరియు జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గ్యారీ బ్యాలెన్స్ ఏప్రిల్ 19న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ ప్రకటించాడు. జింబాబ్వే తరపున కేవలం ఒక టెస్ట్, ఐదు ODIలు మరియు ఒక T20 ఇంటర్నేషనల్ ఆడాడు. ఇక గ్యారీ ఇంగ్లాండ్ తరుపున 2014 నుంచి 2017 వరకు 23 టెస్టులు ఆడాడు. తర్వాత ఫామ్ కోల్పోయి ఇంగ్లాండ్ జట్టుకు దూరమయ్యాడు. అనంతరం గ్యారీ జింబాబ్వేతో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా.. తాజాగా ఈ ఆటగాడు మూడు ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. .
గ్యారీ బ్యాలెన్స్ 2014 సంవత్సరంలో ఇంగ్లండ్‌కు అరంగేట్రం చేశాడు. ఆ జట్టు తరుపున మొత్తం 23 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1498 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు మరియు ఏడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
Read More: IPL 2023: చిన్నారి సాహసం.. వామికను డేట్ కి తీసుకెళ్లొచ్చా అంటూ విరాట్ కోహ్లీకి ప్లకార్డు?