25 All Out: క్రికెట్ లో మరో సంచలనం.. 25 పరుగులకే ఆలౌట్‌

బీబీఎల్ లో సిడ్నీ 15 పరుగులకే ఆలౌట్‌ (All Out) కాగా రంజీ ట్రోఫీలోనూ అలాంటి సంచలనం నమోదైంది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో నాగాలాండ్‌ 25 పరుగులకే ఆలౌట్‌ (All Out) అయింది. ఈ మ్యాచ్ లో ఉత్తరాఖండ్‌ 174 పరుగుల తేడాతో గెలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోర్‌.

  • Written By:
  • Publish Date - December 17, 2022 / 11:16 AM IST

బీబీఎల్ లో సిడ్నీ 15 పరుగులకే ఆలౌట్‌ (All Out) కాగా రంజీ ట్రోఫీలోనూ అలాంటి సంచలనం నమోదైంది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో నాగాలాండ్‌ 25 పరుగులకే ఆలౌట్‌ (All Out) అయింది. ఈ మ్యాచ్ లో ఉత్తరాఖండ్‌ 174 పరుగుల తేడాతో గెలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోర్‌. 2010-11 సీజన్‌లో హైదరాబాద్.. రాజస్థాన్‌ చేతిలో 21 పరుగులకే ఆలౌట్‌ అయింది. రంజీ చరిత్రలో ఇదే లోయెస్ట్‌ స్కోర్‌.

ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-ఎ తొలి మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో నాగాలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో నాగాలాండ్ అతి తక్కువ స్కోరుకే కుప్పకూలింది. నాగాలాండ్‌కు విజయానికి కేవలం 200 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఈ జట్టు ఈ లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయింది. మ్యాచ్ చివరి రోజైన శుక్రవారం తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 25 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో ప్రస్తుత రంజీ సీజన్‌ను ఉత్తరాఖండ్‌ విజయంతో ప్రారంభించింది.

Also Read: Big Bash League: బిగ్ బాష్ లీగ్ లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్..!

ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేసింది. దీంతో నాగాలాండ్ జట్టు 389 పరుగులు చేసి ఆధిక్యంలో నిలిచింది. ఉత్తరాఖండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్ల నష్టానికి 306 పరుగుల వద్ద డిక్లేర్ చేసి నాగాలాండ్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే ఈ స్కోరు దగ్గర కూడా ఈ జట్టు చేరలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో నాగాలాండ్ బ్యాటింగ్ దారుణంగా ఉండడంతో ఏడుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు బౌలర్లు మాత్రమే నాగాలాండ్ జట్టును పెవిలియన్‌లో కూర్చోబెట్టారు. మయాంక్ మిశ్రా తొమ్మిది ఓవర్లలో నాలుగు పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో స్వప్నిల్ సింగ్ తొమ్మిది ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.