Sri Lankan Cricketer Died: క్రికెట్ ప్రపంచంలో విషాదం: శ్రీలంక క్రికెటర్‌ని కాల్చి చంపిన దుండగుడు

41 ఏళ్ల ధమ్మికపై కాల్పులు జరిపినప్పుడు, అతని భార్య మరియు పిల్లలు ఇంట్లో ఉన్నారు. శ్రీలంక క్రికెటర్ ధమ్మిక నిరోషణకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు కానీ అతను శ్రీలంక అండర్ 19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

Published By: HashtagU Telugu Desk
Dhammika Niroshana

Dhammika Niroshana

Sri Lankan Cricketer Died: శ్రీలంక క్రికెట్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీలంక అండర్‌-19 జట్టు మాజీ కెప్టెన్‌ ధమ్మిక నిరోషణ కుటుంబసభ్యుల ఎదుటే హత్యకు గురయ్యాడు. అంబలంగోడాలోని అతని ఇంటి వెలుపల ధమ్మిక నిరోషన్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శ్రీలంక పోలీసులు షూటర్ కోసం గాలిస్తున్నారు. నిందితులు 12 బోర్ గన్‌తో వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించి పోలీసులకు ఎలాంటి కీలక సమాచారం అందలేదు.

41 ఏళ్ల ధమ్మికపై కాల్పులు జరిపినప్పుడు, అతని భార్య మరియు పిల్లలు ఇంట్లో ఉన్నారు. శ్రీలంక క్రికెటర్ ధమ్మిక నిరోషణకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు కానీ అతను శ్రీలంక అండర్ 19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఫాస్ట్ బౌలర్ మరియు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. 2001 మరియు 2004 మధ్య, అతను గాలే క్రికెట్ క్లబ్ తరపున 12 ఫస్ట్-క్లాస్ మరియు 8 లిస్ట్ A మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత అతనికి అవకాశం రాలేదు. అవకాశాలు లేకపోవడంతో అతి చిన్న వయసులోనే క్రికెట్‌కు దూరమయ్యాడు.

ఇదిలా ఉంటే టీమిండియా త్వరలో శ్రీలంక పర్యటన చేపట్టనుంది. జూలై 26 నుండి శ్రీలంక వేదికగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడాల్సి ఉంది, ఇందులో చివరి మ్యాచ్ జూలై 29 న జరుగుతుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు.

Also Read: Agnipath : అగ్నిపథ్‌ పథకం పై హరియాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  Last Updated: 17 Jul 2024, 06:41 PM IST