Site icon HashtagU Telugu

IPL 2024 Auction : ఆ ఐదుగురిపైనే ఫ్రాంచైజీల గురి…జాక్ పాట్ కొట్టేదెవరో ?

IPL 2024

Ipl 2024 Auction

ఐపీఎల్ మినీ వేలానికి (IPL 2024 Auction) కౌంట్ డౌన్ మొదలైంది. దుబాయ్ వేదికగా రేపు ఆటగాళ్ళ వేలం జరగనుంది. ఇప్పటికే అన్ని జట్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తవగా.. ట్రేడింగ్ విండో కూడా ముగిసింది. ఇక మిగిలిన 77 ఖాళీల కోసం 333 మంది పోటీపడుతున్నారు. వీరిలో జాక్ పాట్ కొట్టేదెవరో…అమ్ముడుపోకుండా మిగిలిపోయేది ఎవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. వరల్డ్ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)17వ సీజన కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. దీనిలో భాగంగా ఆటగాళ్ళ మినీ వేలానికి రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఆక్షన్ లో 333 మంది ప్లేయర్స్ బరిలో నిలిచారు. దీనిలో 214 మంది భారతప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్ సీస్ స్లాట్స్ ఉన్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఈ వేలానికి సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. కాగా ఈ వేలంలో ఐదుగురు విదేశీ ప్లేయర్స్ పైనే అందరి కళ్లూ ఉన్నాయి. వీళ్ళ కోసం ఫ్రాంఛైజీలు కోట్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రపంచరప్ లో అదరగొట్టిన మిచెల్ స్టార్క్ , ట్రావిస్ హెడ్ , సౌతాఫ్రికా యువపేసర్ కొయిట్జీ , వాండర్ డస్సెన్ , న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చివరిసారి 2015లో ఐపీఎల్లో ఆడిన ఈ ఆస్ట్రేలియా స్టార్ లెఫ్టామ్ పేస్ బౌలర్.. ఈసారి వేలం కోసం మళ్లీ తన పేరు నమోదు చేయించుకున్నాడు. వేలంలో స్టార్క్ కే అత్యధిక ధర పలికే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ స్టార్క్ 27 ఐపీఎల్ మ్యాచ్ లలో 7.17 ఎకానమీతో 34 వికెట్లు తీశాడు. టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలను దూరం చేసిన ట్రావిస్ హెడ్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.దూకుడుగా ఆడే హెడ్ కూడా భారీ ధర పలికే అవకాశముంది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు సౌతాఫ్రికాకు చెందిన పేస్ బౌలర్ కొయిట్డీ జాక్ పాట్ కొట్టే ఛాన్సుంది. వన్డే వరల్డ్ కప్ లో ఆకట్టుకున్న కొయిట్జీ 8 మ్యాచ్ లలో 19.8 సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ లోనూ జోహెనస్ బర్గ్ సూపర్ కింగ్స్ తరఫున 17 వికెట్లు తీశాడు. కొయెట్జీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఇక వన్డే వరల్డ్ కప్ లో పరుగుల వరద పారించిన న్యూజిలాండ్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ జరగనుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మూడు సెంచరీలు సహా వరల్డ్ కప్ లో 578 రన్స్ చేశాడు. ఇదిలా ఉంటే శ్రీలంకకు చెందిన హసరంగ కూడా భారీ ధర పలికే అవకాశముంది. మంచి స్పిన్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించగల ఈ లంక ప్లేయర్ కోసం వేలంలో ఫ్రాంఛైజీలు పోటీ పడొచ్చు.

Read Also : హైదరాబాద్‌లో కర్ణాటక ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణిస్తున్న మహిళ..