Hardik Pandya: ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా ఏళ్ల నుంచి ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. బౌలింగ్ విషయంలో పాండ్యా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఈ సమస్య వన్డే ఫార్మెట్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే హార్దిక్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అందుకే హార్దిక్ ఎర్లీ ఏజ్ లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఒక టి20 , ఒక వన్డే సిరీస్ ఆడుతుంది. టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తవ్వగా రెండిట్లోనే టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది.
టి20 భవిష్యతు కెప్టెన్ హార్దిక్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్ తెరపైకి వచ్చాడు. కాగా ఫిట్‌నెస్ ఇష్యూస్ కారణంగానే హార్దిక్‌కు బదులు సూర్యకుమార్‌కు టీ20 పగ్గాలు అప్పజెప్పారు. అంతేకాదు హార్దిక్ ని లంకతో జరిగే వన్డే సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు.దీంతో హార్దిక్ వన్డే ఫార్మేట్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని తెలిపాడు. వన్డే టీమ్‌లో ఉండాలంటే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ను మెరుగుపర్చుకోక తప్పదని, కనీసం 8 ఓవర్లు వేయాల్సిందేనని స్పష్టం చేశాడు. దీనికి ముందు అతను సాధ్యమైనన్ని ఎక్కువ టి20 మ్యాచ్‌లు ఆడాలి. తాను ఫిట్‌గా ఉన్నానని అతడు భావిస్తే వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు.
వన్డేల్లో బౌలర్ 10 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హార్దిక్ 10 లేదా 8 ఓవర్లు వేయగలను అని అతను అనుకుంటాడో అప్పుడే తాను వన్డేకి సెలెక్ట్ అవుతాడు అంటూ శాస్త్రి తన మనసులో భావాలను వ్యక్తపరిచాడు. ఇకపోతే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టి20లో హార్దిక్ ఫర్వాలేదనిపించాడు. మొదటి టీ20లో అంతగా రాణించకపోయినా.. రెండో మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే రెండు మ్యాచ్‌ల్లో కలిపి 31 పరుగులు చేశాడు.
Also Read: Milk from Neem Tree : వేప చెట్టు నుండి పాలు..ఇది దేవుడి మాయే అంటున్న భక్తులు