Rishabh Pant: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన రిష‌బ్ పంత్‌.. త‌క్కువ బంతుల్లోనే 3 వేల ప‌రుగులు..!

శుక్రవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన IPL 2024 26వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

  • Written By:
  • Updated On - April 13, 2024 / 10:44 AM IST

Rishabh Pant: శుక్రవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన IPL 2024 26వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను తన ఐపీఎల్ కెరీర్‌లో 3000 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ రికార్డుతో పంత్‌..యూసుఫ్ పఠాన్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్ ,మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు. పంత్ ఈ ఇన్నింగ్స్ ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి సీజన్‌లో రెండవ విజయాన్ని నమోదు చేసింది.

రిషబ్ పంత్ 2028 బంతుల్లో ఐపీఎల్‌లో 3000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. గతంలో ఈ రికార్డు యూసుఫ్ పఠాన్ పేరిట ఉండేది. ఈ మాజీ బ్యాట్స్‌మెన్ 2062 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. రిషబ్ పంత్ ఇప్పుడు తన కంటే 34 బంతులు తక్కువగా తీసుకొని ఈ రికార్డు సృష్టించాడు.

అతి తక్కువ బంతుల్లో 3000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు

2028 బంతులు- రిషబ్ పంత్*
2062 బంతులు – యూసుఫ్ పఠాన్
2130 బంతులు- సూర్యకుమార్
2135 బంతులు- సురేష్ రైనా
2152 బంతులు- MS ధోని
2203 బంతులు- KL రాహుల్
2225 బంతులు- సంజు శాంసన్

Also Read: David Warner in Pushpa 2 : పుష్ప 2 లో ఆ క్రికెటర్.. అదే జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్..!

ఈ మైలురాయిని అందుకున్న మూడో అతి పిన్న వయస్కుడైన భారత బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 3000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ కాగా, ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలో 3000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కులు

– 24 సంవత్సరాలు, 215 రోజులు- శుభ్‌మన్ గిల్
– 26 ఏళ్ల 186 రోజులు – విరాట్ కోహ్లీ
– 26 ఏళ్ల 191 రోజులు – రిషబ్ పంత్
– 26 సంవత్సరాల 320 రోజులు – సంజు శాంసన్
– 27 ఏళ్ల 161 రోజులు- సురేష్ రైనా

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారతీయుల జాబితాలో ఇన్నింగ్స్ పరంగా రిషబ్ పంత్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. సురేశ్ రైనా, రిషబ్ పంత్‌లు 103 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

We’re now on WhatsApp : Click to Join

అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు చేసిన ఆటగాళ్లు

80 ఇన్నింగ్స్‌లు – KL రాహుల్
94 ఇన్నింగ్స్‌లు – శుభ్‌మన్ గిల్
103 ఇన్నింగ్స్‌లు- సురేష్ రైనా/రిషబ్ పంత్
104 ఇన్నింగ్స్‌లు- అజింక్యా రహానే
109 ఇన్నింగ్స్‌లు- రోహిత్ శర్మ/శిఖర్ ధావన్
110 ఇన్నింగ్స్‌లు- గౌతమ్ గంభీర్/విరాట్ కోహ్లీ