Site icon HashtagU Telugu

RCB vs KKR: కోహ్లీ స్లో బ్యాటింగ్.. సెల్ఫిష్ అంటున్న నెటిజన్లు

RCB vs KKR

RCB vs KKR

RCB vs KKR: సొంతగడ్డపై బెంగుళూరుకు కేకేఆర్ షాకిచ్చింది. ఐపీఎల్ 10వ మ్యాచ్ లో భాగంగా ఆర్సీబీ , కేకేఆర్ మధ్య జరిగిన పోరులో కేకేఆర్ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ వరుసగా రెండు మ్యాచ్ లను చేజార్చుకోగా, కేకేఆర్ ఆడిన రెండిట్లోనూ విజయం సాధించింది. విశేషం ఏంటంటే కేకేఆర్ వ‌రుస‌గా ఆరు సార్లు ఆర్సీబీని వారి హోం గ్రౌండ్ లో ఓడించింది. దీంతో హోం టీమ్స్ విజయాల సెంటిమెంట్ కు బ్రేక్ అయింది. వరుసగా 9 మ్యాచ్ ల్లోనూ ఆతిథ్య జట్లే గెలవగా…10వ మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. సమష్టి కృషితో సత్తా చాటిన కలకత్తా 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ పై విజయం సాధించింది.

కేకేఆర్‌ బౌలర్లు చక్కటి బౌలింగ్‌ వేశారు. మిగతా వాళ్లను స్కోర్‌ చేయడంలో నియంత్రించారు. కానీ విరాట్ కోహ్లీని బ్యాటింగ్‌ విధ్వంసానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ కు తెరలేపాడు. 59 బంతుల్లోనే 83 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ర్లతో పెను విధ్వంసం సృష్టించాడు. కోహ్లీ ధాటిగా ఆడటంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. గ్రీన్ 33, మ్యాక్స్‌వెల్ 28, చివర్లో దినేష్ కార్తీక్ 20 పరుగులతో మెరిశారు. అయితే విరాట్ 140.68 స్ట్రైక్ రేట్‌తో ఆడి ఆర్సీబీకి ఆ మాత్రం స్కోర్ రాబట్టినప్పటికీ సోషల్ మీడియాలో కోహ్లీ బ్యాటింగ్ తీరును ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌తో జరిగిన మునుపటి మ్యాచ్ లో విరాట్ 49 బంతుల్లో 77 పరుగులతో 157.14 స్ట్రైక్ రేట్ మైంటైన్ చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 21 పరుగులు చేశాడు. కేకేఆర్ పై స్ట్రైక్ రేట్ 140.68 తో పరుగులు రాబట్టాడు. అయినప్పటికీ విరాట్ సెల్ఫిష్ గేమ్ అడాడని ఫైర్ అవుతున్నారు. నిజానికి చివరి 21 బంతుల్లో కోహ్లి బ్యాట్‌ నుంచి ఒక్క బౌండరీ మాత్రమే వచ్చింది. ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేయడం గమనించొచ్చు.

కింగ్ తన సొంత మైదానంలో బౌండరీల కోసం కష్టపడ్డాడు. కోహ్లి వేగంతో చివరి ఓవర్లు ఆడినట్లయితే ఆర్సీబీ స్కోరు 200 దాటి ఉండేది.అయితే ఆర్సీబీ ఓటమికి కోహ్లీని నిందించలేం .బట్ చివర్లో కోహ్లీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో మనందరికీ తెలుసు. మ్యాచ్ విజయం తనపై ఆధారపడిన ప్రతిసారి బీభత్సం సృష్టించే కింగ్ గత రాత్రి మాత్రం ఆ ప్రయత్నం చేయలేకపోయాడు. మరోవైపు కోహ్లీకి సహచర బ్యాటర్లు సహకారం అందించకపోవడం కూడా స్కోర్ భారీగా చేయలేకపోయారు. కేకేఆర్ లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు ముందు 200 స్కోర్ ఉంచితే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. అయితే ఇక్కడ ఫ్యాన్స్ ఖుషి అవ్వాల్సిన విషయం ఏంటంటే టి20 ప్రపంచ కప్ కు కోహ్లీని ఆడించాలా లేదా అనేది ఐపీఎల్ లో కోహ్లీ ప్రదర్శనపై ఆధారపడి ఉంది. కానీ విరాట్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనే ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన అందించాడు. ఫలితంగా స్ట్రైక్ రేట్ కూడా మెరుగుపడింది, ఇందులో ఎలాంటి సందేహం లేదు.

We’re now on WhatsApp : Click to Join

కోహ్లి పటిష్టంగా ఆరంభిస్తున్నాడు, కానీ ఇన్నింగ్స్ అంతటా ఆ స్ట్రైక్ రేట్‌ను కొనసాగించలేకపోయాడు.183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా టీమ్ కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫలిప్ సాల్ట్ ధనాధన్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సునీల్ నరైన్ 47 పరుగుల తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. సాల్ట్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ లు కోల్ కతాను విజయం వైపు నడిపించారు. వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. శ్రేయాస్ అయ్యర్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సిక్సర్ తో కేకేఆర్ కు విజయాన్ని అందించాడు.

Also Read: Pemmasani Chandrasekhar: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఈసీ నోటీసులు