Jasprit Bumrah: బుమ్రా రాకతో ఫ్యాన్స్ ఎమోషన్

ఐర్లాండ్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టింది. ఈ టూర్ కి బుమ్రా హైలెట్ కానున్నాడు. గాయం కారణంగా ఏడాది నుంచి బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు.

Jasprit Bumrah: ఐర్లాండ్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టింది. ఈ టూర్ కి బుమ్రా హైలెట్ కానున్నాడు. గాయం కారణంగా ఏడాది నుంచి బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు. చాన్నాళ్ల తరువాత టీమిండియాలో బుమ్రా కనిపించడం అభిమానుల్ని ఎమోషన్ కు గురి చేస్తుంది. జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నప్పటికీ బలమైన బౌలర్ బుమ్రా లేని లోటు స్పష్టం కనిపించింది.పైగా ఈ టూర్ కి బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తుండటం విశేషం. బుమ్రా సెప్టెంబర్ 2022 నుండి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీర్ఘకాలిక గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న బుమ్రా ఈ సిరీస్ తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ టూర్ లో బుమ్రా తన ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత భారత్ ఆసియాకప్ , ఆ తరువాత ప్రపంచ కప్ మహాసంగ్రామంలో అడుగుపెట్టబోతుంది. వరల్డ్ కప్ లో బుమ్రా సేవలు జట్టుకు చాలానే అవసరం.

ఐర్లాండ్ పర్యటనకు సెలెక్ట్ అయిన ఆటగాళ్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా , రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, సంజు శాంసన్, జితేష్ శర్మ, రవి బిష్ణోయ్, ప్రసీద్ధ్ కృష్ణ,, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ ఉన్నారు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా వంటి సీనియర్‌ ఆటగాళ్లకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి లభించింది.

Also Read: Rahul Gandhi: కూరగాయల వ్యాపారితో రాహుల్ భోజనం..