Nude Selfie: బోల్డ్​గా స్టార్​ క్రికెటర్.. ఇన్‌స్టాలో న్యూడ్‌ ఫొటో..!

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ సోషల్​ మీడియా యూజర్స్​, అభిమానులకు షాక్ ఇచ్చాడు.

  • Written By:
  • Updated On - November 18, 2022 / 07:48 PM IST

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ సోషల్​ మీడియా యూజర్స్​, అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇన్‌స్టా స్టోరీలో తన నూడ్​ ఫొటోను షేర్​ చేశాడు. ప్రైవేట్ పార్ట్ కనబడకుండా పుర్రె బొమ్మ ఎమోజీతో కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఆటగాడు వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన నగ్న సెల్ఫీని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాడు. చిత్రంలో రస్సెల్
న్యూడ్‌గా తీసుకున్న సెల్ఫీని రస్సెల్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. అద్దం ముందు నిల్చొని ఈ ఫొటో తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే తన ప్రైవేట్ పార్ట్ ని ఎమోజీతో కవర్ చేశాడు. ప్రస్తుతం రస్సెల్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఫోటో చుసిన ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఫోటోను పరిశీలిస్తే రస్సెల్ షాపింగ్ మాల్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. అందులో సెల్ఫీని క్లిక్ చేసినట్లు అర్థం అవుతోంది.

బాలీవుడ్ నటుడు ఇంతకుముందు తన నగ్న చిత్రాలను పంచుకున్న తర్వాత చాలా మంది అభిమానులు రస్సెల్‌ను రణవీర్ సింగ్‌తో పోల్చారు. అప్పుడు ఆ ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. ఆ చిత్రాలు మార్ఫ్డ్ అని రణవీర్ తర్వాత స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొంతమంది ట్విట్టర్ యూజర్స్ రస్సెల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు ఫన్నీ మీమ్‌లను షేర్ చేస్తున్నారు. రణ్‌వీర్ న్యూడ్‌ ఫొటో షూట్‌కు ఇది లైట్ వర్షన్ అని సెటైర్లు పేల్చుతున్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ కోసం కేకేఆర్ రస్సెల్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.