Rishabh Pant: ఢిల్లీ విడుదల చేయడంతో 2 కోట్ల బేస్ ప్రైస్ తో రిషబ్ పంత్ (Rishabh Pant) వేలంలోకి వచ్చాడు. సహజంగానే పంత్‌ను కొనుగోలు చేసేందుకు చాలా జట్లు పోటీకి వస్తాయి. ప్రధానంగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో ఉంది. ధోనీ అనంతరం ఆ జట్టుకు కీపర్ అవసరం. పంత్ ని తీసుకుంటే కీపింగ్, కెప్టెన్ బాధ్యతలు తీసుకుంటాడు. పైగా పంత్ కోసం ధోనీ ఓ అడుగు ముందుకేసి ఫ్రాంచైజీతో కూడా మాట్లాడట. సో వేలంలో పంత్ కోసం పోటీ పడే జట్లలో చెన్నై ముందంజలో ఉంటుంది. అయితే మిగతా జట్లు కూడా పంత్ ని దక్కించుకోవాలని చూస్తున్నాయి.
కానీ రాజస్థాన్ రాయల్స్ కి పంత్ అవసరం ఉండకపోవచ్చు. దానికి 3 కారణాలున్నాయి. ఈ కారణాల కారణంగా రాజస్థాన్ పంత్ కోసం వేలంలో పోటీకి దూరంగా ఉండొచ్చు. సంజూ శాంసన్ గత నాలుగేళ్లుగా రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో జట్టు ట్రోఫీని గెలవకపోయినా ఫైనల్స్‌కు చేరింది. సంజు ఒక అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మన్. సో ఆర్ఆర్ కి మరో వికెట్ కీపర్ అవసరం లేదు. దీంతో రాజస్థాన్ కి రిషబ్ పంత్ కోసం వేలంలో పోటీ పడే అవకాశమే లేదు.
Also Read: Congress Ministers: ఎన్నికల ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి
ఒకవేళ సంజూ శాంసన్ గాయం బారీన పడితే అతని బ్యాకప్‌గా ధృవ్ జురెల్ జట్టులో ఉన్నాడు. 14 కోట్లు చెల్లించి జురెల్‌ను రాజస్థాన్ తన వద్దే ఉంచుకుంది. కాబట్టి ఫ్రాంచైజీ అతనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఈ యువ ఆటగాడు తన ఫినిషింగ్ సామర్థ్యంతో గత సీజన్లలో రాజస్థాన్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసినా తుది జట్టుని సెట్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. సో ఈ మూడు రీజన్స్ ని బట్టి చూస్తే ఆర్ఆర్ కి పంత్ అవసరం లేదనిపిస్తుంది.
పైగా ఆర్ఆర్ స్క్వాడ్ కూడా బాగుంది. ఆ జట్టు ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్‌ల ధరను 18 కోట్లుగా ఖరారు చేసింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లకు 14 కోట్ల చొప్పున చెల్లించింది. అలాగే షిమ్రాన్ హిట్‌మెయర్‌కు 11 కోట్లు, సందీప్ శర్మకు 4 కోట్లు చెల్లించనుంది. గత నాలుగేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంతో సందీప్ శర్మ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ అయ్యాడు. అయితే గత కొన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన జాస్ బట్లర్‌ను విడుదల చేసింది.