Kidambi Srikanth: ఇండియా ఓపెన్ నుంచి కిదాంబి శ్రీకాంత్ అవుట్

ఇండియా ఓపెన్ టోర్నమెంట్ నుంచి భారత్ స్టార్ ఆటగాడు, మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) నిష్క్రమించాడు. డెన్మార్క్ ఆటగాడు అక్సెల్‌సెన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రౌండ్‌లో 14-5తేడాతో విజృంభించినా తరువాతి రెండు సెట్లలో 21-14, 21-19తేడాతో ఓడిపోయాడు.

  • Written By:
  • Publish Date - January 19, 2023 / 08:25 AM IST

ఇండియా ఓపెన్ టోర్నమెంట్ నుంచి భారత్ స్టార్ ఆటగాడు, మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) నిష్క్రమించాడు. డెన్మార్క్ ఆటగాడు అక్సెల్‌సెన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రౌండ్‌లో 14-5తేడాతో విజృంభించినా తరువాతి రెండు సెట్లలో 21-14, 21-19తేడాతో ఓడిపోయాడు. దీంతో కిదాంబి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ బుధవారం తొలి రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్ చేతిలో ఓడి నిష్క్రమించాడు. ప్రపంచ నంబర్ 1, ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ విక్టర్ చేతిలో 21-14, 21-19తో శ్రీకాంత్ ఓడిపోయాడు. ఈ మ్యాచ్ 41 నిమిషాల పాటు సాగింది. తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రపంచ మాజీ నంబర్ వన్ శ్రీకాంత్ రెండో గేమ్‌లో ఒక దశలో 14-5తో ఆధిక్యంలో ఉన్నాడు. విక్టర్ ఆ తర్వాత ఆధిక్యాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. అక్సెల్‌సెన్ 18-18 తర్వాత 19-19తో వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

Also Read: Guava leaves: జామపండ్ల వల్లే కాదండోయ్ ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు?

అంతకుముందు మంగళవారం అగ్రశ్రేణి మహిళా క్రీడాకారిణి పివి సింధు కూడా తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో భారత జోడీ శిఖా గౌతమ్‌-అశ్విని భట్‌ 8-21, 11-21తో మలేషియా జోడీ తీనా మురళీధరన్‌-టాన్‌ పార్లీ చేతిలో ఓడిపోయింది.