Site icon HashtagU Telugu

Bazball: బెడిసికొట్టిన ఇంగ్లాండ్ బజ్ బాల్ స్ట్రాటజీ

Bazball

Resizeimagesize (1280 X 720) (3) 11zon

క్రికెట్ లో అన్ని సందర్భాల్లో దూకుడు పనికి రాదు.. ఒక్కోసారి పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సి ఉంటుంది. లేకుంటే ఓటమి చవిచూడక తప్పదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఇంగ్లీష్ టీమ్ కి వచ్చింది. సందర్భాన్ని బట్టి ఆడలేక కివీస్ గడ్డపై సీరీస్ గెలిచే అద్భుత అవకాశాన్ని చేజేతలా జారవిడుచుకుంది. నిజానికి గత కొంత కాలంగా టెస్టుల్లో ఇంగ్లాండ్ కు ఉన్న విన్నింగ్ రికార్డు మరే ఇతర జట్టుకు లేదు. బజ్ బాల్ (దూకుడుగా ఆడడం) కాన్సెప్ట్ తో సంచలన విజయాలు సాధిస్తూ అదరగొడుతోంది. బజ్‌బాల్‌ (Bazball) క్రికెట్‌ మంత్రంతో వరుసగా సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లను మట్టికరిపించింది. అయితే అన్ని సందర్భాల్లో ఈ వ్యూహం వర్కౌట్ కాదని ఇంగ్లాండ్ కు ఇప్పుడు అర్థమయింది.

రూట్‌, హ్యారీ బ్రూక్‌ శతకాలతో ఇంగ్లాండ్ 435 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్‌ చేసి ఫాలోఆన్‌ కూడా ఆడించింది. అయితే ఇన్నింగ్‌ తేడాతో గెలవాలన్న ఇంగ్లండ్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది. కేన్‌ విలియమ్సన్‌ శతకంతో మెరవగా.. బ్లండెల్‌, టామ్‌ లాథమ్‌, డెవన్‌ కాన్వే, డారిల్‌ మిచెల్‌లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులకు ఆలౌటైన కివీస్.. ఇంగ్లండ్‌ ముందు 258 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. బజ్‌బాల్‌ మంత్రంతో ఊగిపోతున్న ఇంగ్లండ్‌ ఆటను చూస్తే టార్గెట్‌ అంత కష్టమేమి అనిపించలేదు.

Also Read: Shardul Thakur: ముంబైలో ఘనంగా శార్దూల్ ఠాకూర్ వివాహం.. స్నేహితురాలినే పెళ్లాడిన క్రికెటర్

అందుకు తగ్గట్టుగానే రూట్‌ తన శైలికి భిన్నంగా వేగంగా ఆడడంతో ఇంగ్లండ్‌ లక్ష్యం దిశగా సాగినట్లే అనిపించింది. అయితే రూట్‌ మినహా మిగతావాళ్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.నిజానికి కాస్త ఓపికగా ఆడి ఉంటే ఇంగ్లండ్‌.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేదే. చివరి సెషన్ లో ఆ జట్టు కాసేపు ఆచితూచి ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదనీ మాజీ ఆటగాళ్ళు అభిప్రాయ పడుతున్నారు. మొత్తం మీద బజ్ బాల్ స్ట్రాటజీ అనుసరించే విషయంలో ఇంగ్లీష్ టీమ్ అప్పుడు ఉండే పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకంటే మంచిదని చెప్పొచ్చు.