పాకిస్థాన్ (Pakistan vs England)తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ (Pakistan vs England) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్థాన్‌కు సొంత గడ్డపైనే ఘోర పరాభవం ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది.
కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లిష్ జట్టు పాకిస్థాన్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో, రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో తొలిసారి పాకిస్థాన్‌ను క్లీన్ స్వీప్ చేసింది. పాకిస్తాన్ జట్టు కూడా స్వదేశంలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ కు గురైయింది.
Also Read: Kerala Soccer Celebrations: సాకర్ సెలబ్రేషన్స్ లో హింసాత్మక ఘటనలు, ఒకరు మృతి, ఎస్ఐకు గాయాలు!
మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌటైంది. దీనికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులు చేసి 50 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 216 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో సాధించింది. మరీ ముఖ్యంగా కరాచీలో జరిగిన మూడో టెస్టులో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఇది పాకిస్తాన్‌కు ఇష్టమైన గ్రౌండ్. ఈ మైదానంలో పాకిస్థాన్ 23 మ్యాచ్‌లు గెలిచింది.