England: జనవరి 22 నుంచి కోల్‌కతా వేదికగా భారత్, ఇంగ్లండ్ (England) జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌కు జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఉండగా, భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్‌తో తొలి టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ ఒక రోజు ముందే ప్రకటించింది. చాలా మంది స్టార్ ప్లేయర్లకు జట్టులో అవకాశం దక్కింది.
ఫిబ్రవరి 2న చివరి మ్యాచ్
భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 22న జరగనుంది. రెండో మ్యాచ్ జనవరి 25న జరగనుండగా, మూడో మ్యాచ్ జనవరి 28న జరగనుంది. జనవరి 31న నాలుగో టీ-20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరగనుంది. T-20 సిరీస్ తర్వాత 3 మ్యాచ్‌ల ODI సిరీస్ ఆడనున్నారు. దీనిలో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6 న జరుగుతుంది.
సూర్యపై అంచనాలు
T20 ప్రపంచ కప్ 2024 తర్వాత BCCI T20 ఫార్మాట్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను రెగ్యులర్ కెప్టెన్‌గా చేసింది. అతని నాయకత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి.
Also Read: New Suzuki Access 125: పేరుకే స్కూటీ.. ఫోన్‌లో ఉన్న ఫీచర్లు అన్ని ఉన్నాయ్!
తొలి T-20 కోసం ఇంగ్లండ్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
వన్డేలకు ఎంపికైన భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
తొలి టీ20కి టీమ్ ఇండియా అంచనా
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.