U19 Women T20 World Cup 2023: రేపు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో..?

అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 12:56 PM IST

అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో ధృడంగా ఉంది. ఫైనల్లోనూ ఇంగ్లండ్ ను ఓడించి కప్ తీసుకురావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనుంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. కాగా, టీమిండియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. భారత్‌ అద్భుత విజయంతో ఫైనల్ లోకి అడుగు పెట్టింది. మరో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కూడా విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. జనవరి 29న భారత్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరగనుంది.

Also Read: Sania Mirza: ఇండియన్ టెన్నిస్ ఐకాన్‌ సానియామీర్జా

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీని తర్వాత రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. ఈ సమయంలో అలెక్స్ స్టోన్‌హౌస్ జట్టు తరపున గరిష్టంగా 25 పరుగులు చేసింది. 33 బంతుల్లో 25 పరుగులు చేసింది. 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా ఇంగ్లండ్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.

ముఖ్యంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. ఈసారి టోర్నీలో టీం ఇండియా ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. శ్రీలంక, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా జట్లను టీమిండియా ఓడించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి కూడా భారత్‌ జట్టు ప్లేయర్ కావడం విశేషం. శ్వేతా సెహ్రావత్ 6 మ్యాచ్‌ల్లో 192 పరుగులు చేసింది.