Ishan Kishan : కడుపులో అంత బాధపెట్టుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్..శభాష్ అన్న !!

టీ20 ప్రపంచకప్ ఫైనల్ వంటి అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఆడటం ఏ క్రికెటర్కైనా జీవితకాల కల. కానీ, అటువంటి చారిత్రాత్మక ఘట్టానికి సరిగ్గా ఒక్కరోజు ముందు తన కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకున్నా

Published By: HashtagU Telugu Desk
Ishan Kishan

Ishan Kishan

Ishan Kishan Final Match : టీ20 ప్రపంచకప్ ఫైనల్ వంటి అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఆడటం ఏ క్రికెటర్కైనా జీవితకాల కల. కానీ, అటువంటి చారిత్రాత్మక ఘట్టానికి సరిగ్గా ఒక్కరోజు ముందు తన కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకున్నా, గుండె నిండా బాధను మోస్తూ దేశం కోసం మైదానంలోకి దిగారు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. ఈ నెల 7వ తేదీన జరిగిన ఒక ఘోర కారు ప్రమాదంలో ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ వైష్ణవి మరియు ఆమె భర్త (బావ) మరణించారు. ఈ వార్త విన్న కిషన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనప్పటికీ, వ్యక్తిగత బాధ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఫైనల్ మ్యాచ్‌లో భాగమయ్యారు.

నిన్న జరిగిన ఫైనల్ పోరులో ఇషాన్ కిషన్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు. కళ్లలో నీళ్లు తిరుగుతున్నా, బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి కీలకమైన 54 పరుగులు సాధించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అనంతరం కిషన్ మాట్లాడుతూ.. ఈ ఇన్నింగ్స్‌ను తన దివంగత సోదరికి అంకితం చేస్తున్నట్లు భావోద్వేగంతో ప్రకటించారు. “ఈ మ్యాచ్ కేవలం ఆమె కోసమే ఆడాను, ఈ విజయం నా సోదరికే అంకితం” అని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.

ఈ క్లిష్ట సమయంలో జట్టు సభ్యులు, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్‌కు కొండంత అండగా నిలిచారు. తన సోదరి మరణవార్తను హార్దిక్ పంచుకోగా.. “ఇలాంటి సమయంలో దేశం కోసం ఆడటమే అసలైన నివాళి, నీ శక్తిని మైదానంలో చూపించు” అని హార్దిక్ స్ఫూర్తిని నింపినట్లు కిషన్ పేర్కొన్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులను కోల్పోయిన పుట్టెడు దుఃఖం, మరోవైపు దేశం ఆశిస్తున్న ప్రపంచకప్ కల.. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ కూడా కిషన్ చూపిన తెగువ నిజంగా అభినందనీయం. అందుకే ఇప్పుడు యావత్ భారత్ “శభాష్ ఇషాన్ కిషన్.. నువ్వు నిజమైన ఛాంపియన్వి” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

  Last Updated: 09 Mar 2026, 11:11 AM IST