Site icon HashtagU Telugu

Ashwin-Jadeja: అశ్విన్, జడేజాలకు మార్గం సుగమం అయినట్టేనా

Jadeja

Ashwin Jadeja

Ashwin-Jadeja: చెన్నై చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 376 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించనప్పటికీ జైస్వాల్ ఆరంభంలో ఫర్వాలేదనిపించాడు. మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసిన వేళ టీమిండియా ఆల్ రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మధ్య సెంచరీ భాగస్వామ్యం భారత్‌కు పునరాగమనాన్ని తెచ్చిపెట్టింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 376 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది.

ఈ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు 113 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ నెలకొల్పాడు 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అశ్విన్ తన సెంచరీతో టీమ్ ఇండియాను క్లిష్ట పరిస్థితుల నుండి బయటికి తీసుకువచ్చాడు. రావడంతోనే ధాటిగా బ్యాటింగ్ మొదలుపెట్టాడు. అతను ఆడే కట్, లాఫ్టెడ్ షాట్లను చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆశ్చర్యంగా చూశాడు.రోహిత్ శర్మ 6, శుభ్‌మన్ గిల్ 0, విరాట్ కోహ్లీ 6 పరుగులతో నిరాశపరిచిన వేళా జడేజా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.అయితే రెండో రోజు 86 పరుగుల వద్ద జడ్డూ వికెట్ కోల్పోయి సెంచరీ మిస్సయ్యాడు.

అశ్విన్-జడేజా (Jadeja) బ్యాటింగ్ చూస్తుంటే వీరిద్దరు బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం కంటే తమ ఉనికిని చాటుకోవాలనే ఆకాంక్ష కనిపించింది. జడేజా ఇప్పటికే టి20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుర్రాళ్ళ రాకతో టీమిండియాలో అశ్విన్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. రాణించే సత్తా ఉన్నప్పటికీ ఫ్యూచర్ జట్టును తయారు చేసే క్రమంలో సీనియర్లకు రెస్ట్ తప్పట్లేదు. దీంతో తమ ప్రతిభను చూపిస్తూ తమలో ఇంకా విధ్వంసం దాగి ఉందని నిరూపించే విషయంలో జడేజా, అశ్విన్ సక్సెస్ అయ్యారు. టీమిండియా స్టార్ బ్యాటర్లు వరుస వికెట్లతో నిరాశపరచగా జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించిన ఈ లెజెండ్స్ ముందు ఇప్పుడు ఓ లక్ష్యం కనిపిస్తుంది. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్ కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నట్లు అర్ధమవుతుంది. నవంబర్‌లో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ అయిదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.ఆ టూర్ కి ఛాన్స్ దక్కాలంటే బంగ్లా టెస్ట్ వీళ్ళకి అత్యంత కీలకం.

Also Read: Tirumala Laddu Controversy : కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ – జగన్