Site icon HashtagU Telugu

Dhruv Jurel: జట్టులో కీలక మార్పు.. డిసైడింగ్ మ్యాచ్ పై గంభీర్ ఫోకస్

Gambhir- Agarkar

Gambhir- Agarkar

Dhruv Jurel: భారత్-ఇంగ్లాండ్ మధ్య 5 టి20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. జనవరి 22న కోల్‌కతాలో జరిగిన తొలి టీ20, జనవరి 25న చెన్నైలో జరిగిన రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 రేపు జనవరి 28న రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియాలో ఓ మార్పు చోటు చేసుకోనుంది.

చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రింకూ సింగ్ స్థానంలో ధృవ్ జురెల్‌కు (Dhruv Jurel) మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. కానీ జురెల్‌ మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. తన బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ మ్యాచ్ లో జురెల్ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 5 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీంతో అతడిని పక్కనపెట్టేందుకు టీం మేనేజ్మెంట్ సిద్దమైనట్లు తెలుస్తుంది.

Also Read: GB Syndrome Symptoms : జీబీఎస్‌ ‘మహా’ కలకలం.. ఏమిటీ వ్యాధి ? లక్షణాలు ఎలా ఉంటాయ్ ?

మూడో టీ20లో గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రమణదీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. రమణదీప్ 2 టీ20 మ్యాచ్‌లు ఆడి ఒక ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 250. అతని పేరిట ఒక వికెట్ కూడా ఉంది. ఇప్పటికే నితీష్ రెడ్డి, రింకూ సింగ్ గాయపడి జట్టుకు దూరమయ్యారు. నితీష్ మొత్తం సిరీస్‌కు దూరం కాగా, రింకూ 2 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వీరిద్దరి స్థానంలో శివమ్ దూబే, రమణదీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకున్నారు.