Dhruv Jurel: 2024 లో అరంగేట్రం చేసినప్పటి నుండి భారత జట్టులో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అదృష్ట చిహ్నంగా మారాడు. అతను జట్టులో ఉన్న ప్రతి టెస్ట్ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇటీవల ఓవల్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా అతని అదృష్టం జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ విజయం 93 ఏళ్ల భారత టెస్ట్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక విజయం.
అదృష్ట చిహ్నంగా ధ్రువ్ జురెల్
యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ 2024 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అతను ప్లేయింగ్ 11లో భాగమైన ప్రతి మ్యాచ్‌లోనూ భారత జట్టు అద్భుత విజయాలను నమోదు చేసింది. ఇప్పటివరకు జురెల్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో నాలుగు మ్యాచ్‌లలో జట్టుకు విజయం లభించింది. పెర్త్ టెస్ట్‌లో ప్లేయింగ్ 11లో భాగం కాకపోయినా.. అతని అదృష్టం జట్టుతో ఉంది.
Also Read: Diet : బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, దోశ తినకూడదా? తింటే ఏమి సమస్యలు వస్తాయి?..దీనిలో నిజమెంతా?
ఓవల్ టెస్ట్ కోసం ప్రధాన వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా దూరమవడంతో జురెల్‌కు అవకాశం లభించింది. ఈ నిర్ణయం జట్టుకు ఎంతగానో కలిసి వచ్చింది. అతను బ్యాటింగ్‌లో పెద్దగా స్కోర్లు చేయకపోయినా (మొదటి ఇన్నింగ్స్‌లో 19, రెండవ ఇన్నింగ్స్‌లో 34), అతని అదృష్టం జట్టుకు విజయాలను తెచ్చిపెట్టింది.
ఓవల్ టెస్ట్.. ఒక చారిత్రాత్మక విజయం
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది. సిరాజ్, ప్రసిద్ధ్ కలిసి నాలుగు కీలకమైన వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్ ఆశలను ఆవిరి చేశారు. ఈ విజయం భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. గత 93 సంవత్సరాలలో భారత జట్టు ఇంటి బయట ఆడుతూ సిరీస్‌లోని ఐదవ టెస్ట్ మ్యాచ్‌ను గెలవడం ఇదే మొదటిసారి. టెస్ట్ క్రికెట్‌లో పరుగుల తేడా పరంగా భారత జట్టుకు ఇది అతి చిన్న విజయం. ధ్రువ్ జురెల్ అదృష్టం, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం, అద్భుతమైన బౌలింగ్ ఈ విజయాన్ని సుసాధ్యం చేశాయి.