Site icon HashtagU Telugu

MS Dhoni: ధోనీ మనం మ్యాచ్ ఓడిపోయాం: సాక్షి ఫన్నీ కామెంట్

Sakshi Ms Dhoni

Sakshi Ms Dhoni

MS Dhoni: సండే నాడు ధోనీ మండే బ్యాటింగ్ తో అలరించాడు. ఆడిన 16 బంతుల్లో తన పాత వైభవాన్ని గుర్తు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో వింటేజ్ హిట్టింగ్ చూపించాడు. విశాఖ తీరంలో ధోని అత్యుత్తమ ప్రదర్శనను చూసి విశాఖపట్నం ప్రేక్షకులు తెగ ఆనందపడిపోయారు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నార్ట్జే బౌలింగ్ లో 2 భారీ సిక్సర్లు బాది కనువిందు చేశాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీకి తొలి విజయం దక్కింది .

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్లకు 171 పరుగులు మాత్రమే చేసి ఈ సీజన్లో తొలి ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచి తొలి విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌ ద్వారా ధోని అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఈ సీజన్‌లో మాహీ తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చి మైదానాన్ని శాసించాడు. చివరి ఓవర్లో 20 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ లో 16 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.అందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు నెలకొల్పాడు.

Sakshi Dhoni on MS Dhoni

ఈ మ్యాచ్ లో ధోనీ తుఫాను ఇన్నింగ్స్‌పై అతని భార్య సాక్షి సింగ్ స్పందించిన విషయం వెలుగులోకి వచ్చింది, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ధోనీ ఇన్నింగ్స్‌కు ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అయితే అవార్డు తీసుకునే సమయంలో ధోనీ చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించాడు. మ్యాచ్ విజయం సాధించినంత ఆనందంగా అవార్డును తీసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింద. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మహి ట్రోఫీతో ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ సాక్షి సింగ్ ఫన్నీ కామెంట్ చేసింది. హాయ్ ధోనీ.. ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని గ్రహించలేదా ఏంటి అంటూ ఫన్నీ కామెంట్ చేసింది. దీంతో సాక్షి పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది. కాగా పొడవాటి జుట్టుతో తన లుక్స్‌తో పాత రోజులను గుర్తుకు తెచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఈ మాజీ కెప్టెన్ ఈ సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చి ఫ్యాన్స్ ను ఆనందపరిచాడు.

We’re now on WhatsApp : Click to Join

తొలి బంతికే ఫోర్ కొట్టి తనలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని చూపించాడు. ధోని 231.25 స్ట్రైక్ రేట్‌తో 16 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. వార్నర్ 35 బంతుల్లో 52 పరుగులు చేయగా, పృథ్వీ షా 27 బంతుల్లో 43 పరుగులు జోడించాడు. పంత్ 51 పరుగులతో అలరించాడు.

Also Read: China Vs Arunachal : అరుణాచల్‌‌ప్రదేశ్‌లోని 30 ఏరియాలకు పేర్లు పెట్టిన చైనా

Exit mobile version