‘‘నేను ధోనీతో మాట్లాడాను. నువ్వు ఐపీఎల్ 2026 సీజన్‌కు కేవలం మిస్డ్‌కాల్ ఇచ్చావంతే. ఇది లెక్కలోకి రాదు. వచ్చే ఏడాది కచ్చితంగా ఆడాల్సిందేనని నేను అతడితో అన్నాను’’ అని రైనా వెల్లడించాడు. దానికి ధోనీ స్పందిస్తూ.. ‘‘నా శరీరం కొంచెం బలహీనంగా అనిపిస్తోంది’’ అన్నాడని రైనా తెలిపాడు. అయితే ‘‘మేం అవేమీ నమ్మం. నువ్వు వచ్చే ఏడాది ఆడాల్సిందేనని నేను స్పష్టం చేశాను’’ అని రైనా వెల్లడించాడు. ఇది ధోనీ వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ అతను మాత్రం పాజిటివ్‌గానే ఉన్నట్లు తనకు అనిపించిందని తెలిపాడు.
ధోనీ ఈ సీజన్ మొత్తం తుది జట్టులో లేడు. కనీసం స్టేడియంలో కూడా కనిపించలేదు. కానీ నిన్న అతణ్ని చెపాక్‌లో చూసి ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. టీమ్ ఫొటోగ్రాఫ్ కోసం మైదానంలోకి రాగానే స్టేడియం దద్దరిల్లింది. ఎలాంటి స్పీచ్ ఇవ్వకుండానే, బౌండరీ లైన్ వెంట నడుస్తూ అభిమానులకు అభివాదం చేశాడు. 44 ఏళ్ల ధోనీ చెపాక్ హోమ్ గ్రౌండ్‌లో కనిపించడం ఇదే చివరిసారి కావచ్చనే బాధతో ఫ్యాన్స్ భావోద్వేగంతో నినాదాలు చేశారు. మరోవైపు రైనాతో ధోనీ వ్యాఖ్యలు, చెపాక్‌లో కనిపించి అభివాదం చేయడం ఆయన రిటైర్మెంట్ హింట్ అయ్యుండొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు.
