Site icon HashtagU Telugu

Chepauk Stadium: చెపాక్ స్టేడియంలో సీట్లకు ఎల్లో పెయింట్ వేసిన ధోనీ.. వీడియో వైరల్..

Dhoni Painted The Seats In Chepak Stadium Yellow.. Video Viral

Dhoni Painted The Seats In Chepak Stadium Yellow.. Video Viral

Yellow Paint to Chepauk Stadium Seats : స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సీట్లకు ఎల్లో పెయింట్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇప్పుడు కచ్చితంగా ఎల్లోలవ్‌లా కనిపిస్తోంది..’ అంటూ ఆ వీడియో తో పాటు ధోనీ కామెంట్ చేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) టీమ్ షేర్ చేశాయి. ఇంతకీ ధోనీ ఎందుకు పెయింటింగ్ వేశాడు? ఎక్కడ పెయింటింగ్ చేశాడు ? ఇప్పుడు తెలుసుకుందాం..

స్టేడియంలోని కొత్త స్టాండ్స్‌ లో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 సందడి మొదలైపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆడబోయే మొదటి నాలుగు మ్యాచులకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. మిగిలిన మ్యాచుల టికెట్లకు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో చెపాక్ (ఎంఏ చిదంబరం) స్టేడియంలో కొన్ని కొత్త స్టాండ్స్‌ని పునర్మించారు. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, గ్రౌండ్ సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం సీట్లకు ఎల్లో పెయింట్ వేశాడు.ఈ సీజన్ తో తన ఐపీఎల్ కెరీర్ కు ముగింపు ఇవ్వాలని అను కుంటున్న ధోనీ.. తన సహచరులతో సరదాగా గడుపుతున్నాడు. చెపాక్ స్టేడియాన్ని (Chepauk Stadium) ఈ మధ్యే పునరుద్ధరించారు.

చాలా ఏళ్ల తర్వాత ఐ,జే,కే స్టాండ్లను ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్ లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించ నున్నారు. ఈ క్రమంలో స్టాండ్స్ లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ బస్సు ప్రయాణం వీడియోను కూడా ఆ టీమ్ షేర్ చేసింది. అందులో ధోని, డ్వేన్ బ్రావోకు విజిల్ వేయడం నేర్పించాడు.

ధోనీ ఫేర్‌వెల్ సీజన్‌..

స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఛానెల్, ధోనీ ఫేర్‌వెల్ సీజన్‌గా ఐపీఎల్ 2023 సీజన్‌ని ప్రమోట్ చేస్తోంది. అయితే సీఎస్‌కే ప్లేయర్లు దీపక్ చాహార్, రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ధోనీకి ఇది ఆఖరి సీజన్ కాదని, కాబోదని.. అతను ఇంకా రెండు మూడు సీజన్లు ఆడతాడని కామెంట్లు చేశారు.

మార్చి 31న, ఏప్రిల్ 3న..

ఐపీఎల్ ఈనెల 31న మొదల వనుంది. సీఎస్కే జట్టు ఈ సీజన్ లో తమ సొంతనగరంలో తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 3న లక్నోతో ఆడనుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై తొలి మ్యాచ్ ఆడనుంది. మూడు సీజన్‌ల తర్వాత సొంత మైదానం చెపాక్ లో మ్యాచ్‌లు ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2020 సీజన్ కరోనా లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా యూఏఈలో జరిగింది.. 2021 సీజన్‌ ఫస్ట్ ఫేజ్‌లో చెన్నైలో మ్యాచులు జరిగినా సొంత మైదానం అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో సీఎస్‌కే మ్యాచులు జరగలేదు. 2022 సీజన్‌లోనూ చెన్నైలో మ్యాచులు నిర్వహించలేదు.

Also Read:  Liver Health Tips: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి..!!