MS Dhoni: ఐపీఎల్ 2025పై ధోనీ ఫ్యాన్స్ ఆశలు.. అందుకే లండన్ టూర్

ధోనీ తన మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. చికిత్స తర్వాతే ధోని ఐపీఎల్‌ రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. కాగా ధోనీ సర్జరీ సక్సెస్ ఫుల్ గా కావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్ .క్షేమంగా లండన్ వెళ్లి లాభంతో ఇండియాకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

MS Dhoni: ఎంఎస్ ధోని గత కొన్నేళ్లుగా కామోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ లోను ధోని గాయంతోనే ఆడాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు ధోనీ ముంబైలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ పూర్తిగా నయం కాలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కి ముందు ధోనీ ఆడతాడో లేదోనని అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే డాక్టర్లు సూచించడంతో ధోనీ ఇంజెక్షన్లు తీసుకుని సీజన్ సెవెంటీన్ లో అడుగు పెట్టాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నైని గెలిపించడానికి తన శక్తి మేరకు పోరాడాడు. ఒకవైపు కండరాలు, వెన్ను నొప్పి గాయాలు బాధిస్తున్నప్పటికీ.. అవేం లెక్కచేయలేదు. కేవలం తనని ఆరాధించే అభిమానుల కోసమే ఇంజక్షన్స్ వాడుతూ మ్యాచ్ ల్లో బరిలోకి దిగాడు. గాయాల కారణంగానే బ్యాటింగ్ ఆర్డర్లో చివర్లో వచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో ధోనీ 14 మ్యాచ్‌ల్లో 53.67 సగటుతో 220.55 స్ట్రైక్‌రేట్‌తో 161 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అత్యధికంగా 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు..ఇకపోతే ధోనీ కేవలం తన అభిమానుల కోసమే ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇది అందరికి తెలిసిన వాస్తవమే. కానీ ఈ సీజన్లో ధోనీ అనేక మ్యాచ్ ల్లో గాయం కారణంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఆర్సీబీతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ధోనీ కీపింగ్ చేసే క్రమంలో నొప్పిని భరిస్తూ ఆడుతూ కనిపించాడు. కొన్ని సార్లు కుంటుకుంటూ కనిపించాడు. ఇది ధోని ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, యావత్ క్రికెట్ ప్రేమికుల్ని బాధకు గురి చేసింది.

దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి తనెంత సక్సెస్ ఫుల్ కెప్టెనో ప్రూవ్ చేసుకున్నాడు మాహీ. ఇప్పుడు 42 ఏళ్ళ వయసులోనూ యువకులతో పోటీ పడుతూ ఆడుతున్నాడు. ట్రోలర్స్ సైతం ధోని త్యాగాన్ని కొనియాడుతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా ఆర్సీబీ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నెక్స్ట్ సీజన్లో ధోనీ ఆడతాడో లేదో తెలియదు. ప్రస్తుతం ధోనీ తన మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. చికిత్స తర్వాతే ధోని ఐపీఎల్‌ రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. కాగా ధోనీ సర్జరీ సక్సెస్ ఫుల్ గా కావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్ .క్షేమంగా లండన్ వెళ్లి లాభంతో ఇండియాకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. సర్జరీ సక్సెస్ అయితే ధోనీ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో ఆడాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: MLA Pinnelli : ఏపీలో ఈవీఎం ధ్వంసం కేసు.. ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్